Site icon HashtagU Telugu

Amit Shah : బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం – అమిత్ షా ప్రకటన

Bc Telangana Cm

Bc Telangana Cm

తెలంగాణ (Telangana) లో బిజెపి (BJP) అధికారంలోకి వస్తే బీసీనేతను సీఎం (BC CM in Telangana) ను చేస్తామని బిజెపి నేత , కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. శుక్రవారం సూర్యాపేట (Suryapet )లో జరిగిన బీజేపీ జనగర్జన సభ (BJP Janagarjana Sabha)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే- వెనుకబడిన వర్గాలకు పట్టం కడతామని అమిత్ షా ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే బీసీ నాయకుడిని సీఎంగా చేస్తామని తేల్చి చెప్పారు. బీసీల సంక్షేమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

ఈ దేశానికి బీసీలే వెన్నెముక అని అభివర్ణించారు. బీసీల కోసం ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే యూపీలో అయోధ్యలో నిర్మితమౌతోన్న రామాలయం గురించి సభలో చెప్పుకొచ్చారు. శ్రీరామచంద్రుడు 550 సంవత్సరాల పాటు ఓ చిన్న డేరాలో నివసించారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం శ్రీరాముడికి అద్భుత ఆలయాన్ని నిర్మిస్తోందని, జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి మోడీ (Modi) ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని ఈ సందర్బంగా అమిత్ షా చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ‘‘దళితుడిని సీఎం చేస్తామని చెప్పే ధైర్యం కేసీఆర్‌ (CM KCR)కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు. తెలంగాణకు బిఆర్ఎస్, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. బిఆర్ఎస్, కాంగ్రెస్‌ ఈ రెండు పార్టీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్యం అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం. రాహుల్‌గాంధీను పీఎం చేయడమే సోనియా లక్ష్యం అన్నారు.

ఇక ఈ సభలో తెలంగాణ బీజేపీ నాయకులు, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు. అయితే బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా నియమిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే సీఎం రేసులో నిలిచేది వీరే అంటూ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే.. బీజేపీలో బలమైన బీసీ నేతలుగా వీరు ముగ్గురు చలామణి అవుతున్నారు. దీంతో వీరిలో ఎవరు సీఎం అవుతారు? అనే చర్చ నడుస్తోంది.

Read Also : Mature Women Don’t Do In A Relationship : రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు పరిణతి చెందిన మహిళలు.. ఈ 15 పనులు అసలు చేయరు..!