Site icon HashtagU Telugu

Amit Shah : కేసీఆర్ ప్రభుత్వంపై అమిత్ షా ప్రశ్నల వర్షం..

Amith sha

Amith sha

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో(Telangana Elections 2023) భాగంగా రాష్ట్రంలో అడుగుపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)..కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) ఫై ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్ల కేసీఆర్ పాలన లో తెలంగాణ అప్పుల రాష్ట్రం అయ్యిందని , కేసీఆర్ ఏ హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కేజీ టు పీజీ విద్య హామీని పూర్తిగా గాలికి వదిలేశారని, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదని , రైతులకు లక్షరూపాయల రుణ మాఫీ చేయలేదని, అలాగే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ సర్కార్.. ఎన్ని ఉద్యోగ ఖాళాలను భర్తీ చేసిందో చెప్పాలంటూ అమిత్ షా ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం కేసీఆర్ సర్కారేనని ఎద్దేవా చేశారు. అమీర్ పేట భూముల్లో స్కామ్ జరిగిందన్న అమిత్ షా.. మిషన్ కాకతీయ పేరుతో వేలకోట్లను దండుకున్నారన్నారు. గ్రానైట్ కుంభకోణంలో కోట్లాది రూపాయల మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కుంభకోణాలు తప్ప చేసిందేమీ లేదని అమిత్ షా తెలిపారు. కేసీఆర్ సహకరించకపోయినా.. కేంద్రం రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకాలు వస్తున్నాయని అమిత్‌షా ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎంకు ఓటు వేస్తే.. బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లేనని అమిత్ షా పేర్కొన్నారు.

రెండు దశాబ్దాలుగా మాదిగ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందని అమిత్ షా పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయటం కోసం కేంద్ర కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని నడిపేవారికి పరిపాలన ఏం తెలుసని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో కాదు‌ .. ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి అవినీతి పరులను జైలుకు పంపుతామని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామన్నారు.

Read Also : Terrorists: ఉగ్రవాదుల్లో పాక్ మాజీ సైనికులు.. 2024 ఎన్నికలకు కుట్ర..!