Site icon HashtagU Telugu

TS Polls : సీఎం కేసీఆర్ అబద్ధాపు ప్రచారాలతో ప్రజలన మోసం చేస్తున్నాడు – అమిత్ షా

Amith sha

Amith sha

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో(telangana election 2023 campaign) భాగంగా బిజెపి కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah)..శనివారం గద్వాల్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీల ఫై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అని .. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని అమిత్ షా ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అబద్ధాపు ప్రచారాలతో ప్రజలన మోసం చేస్తున్నారని , రూ. 70 కోట్లు జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోడీ ఇచ్చారు, కానీ ఆ డబ్బులను కేసీఆర్ ఖర్చు చేయలేదని ఆరోపించారు. గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్‌ను కేసీఆర్ నిర్మించలేదన్నారు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌, మజ్లిస్‌లు.. 2జీ, 3జీ ,4 జీ పార్టీలు అని పేర్కొన్నారు. 2 జీ అంటే కేసీఆర్‌, కేటీఆర్‌.. 3జీ అంటే 3 తరాలుగా రాజకీయాలు చేస్తున్న ఒవైసీ కుటుంబ పార్టీ.. 4జీ పార్టీ అంటే జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా, సోనియా, రాహుల్‌ గాంధీ.. 4 తరాలుగా కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ రాజకీయాలు చేస్తోందని వివరించారు. 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఏపీని నిధులివ్వకుండా కాంగ్రెస్‌ మోసం చేసింది. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మించలేకపోయారు. అయోధ్యలో రామమందిరం నిర్మించకుండా కాంగ్రెస్‌ అన్యాయం చేసింది. జనవరి 22న రామమందిరంలో రామ్‌లాల్‌ను ప్రాణప్రతిష్ఠ చేస్తాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే అయోధ్యలో ఉచితంగా రామ దర్శనం చేయిస్తాం.” అని అమిత్ షా తెలిపారు.

డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్బంగా అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also :