Site icon HashtagU Telugu

Amit Shah Fake Video: ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపిన సీఎం రేవంత్ రెడ్డి

Amit Shah Fake Video

Amit Shah Fake Video

Amit Shah Fake Video: లోకసభ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపడం రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుంది. సీఎం స్థాయి వ్యక్తిని ఎలాంటి నేరారోపణలు లేకుండా ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు తాజాగా నోటీసులు పంపారు. కాగా తాజాగా రేవంత్ ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు. వివరాలలోకి వెళితే..

రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు అమిత్ షా వీడియోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అయితే అది ఫేక్ అంటూ బీజేపీ స్పందించింది. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసుని సుమోటుగా తీసుకున్నారు. ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫేక్ వీడియోలు ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్‌ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కు నోటీసు జారీ చేసి మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా ఈ డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారికీ తగిన బుద్ధి చెబుతామని మోదీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులకి వివరణ ఇచ్చారు.

We’re now on WhatsAppClick to Join

అమిత్ షా ఫేక్‌ వీడియోకు తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు సమాధానం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఐఎన్‌సీ ఎక్స్‌ ఖాతాను తాను నిర్వహించడం లేదన్నారు ఆయన. సీఎంవో తెలంగాణ, మరియు నా వ్యక్తిగత ఖాతా మాత్రమే వినియోగిస్తున్నానని, తెలంగాణ ఐఎన్‌సీ ఎక్స్‌ ఖాతాను నేను నిర్వహించడం లేదని సమాధానం ఇచ్చారు రేవంత్. అయితే రేవంత్ ఇచ్చిన సమాధానానికి ఢిల్లీ అధికారులు సంతృప్తి చెందుతారో లేదో చూడాలి.

Also Read: Tragedy in Mumbai: ముంబైలో దారుణం.. టార్చ్ లైట్ వేసి ఆపరేషన్.. తల్లీబిడ్డ మృతి