Site icon HashtagU Telugu

Amit Shah In TS: కేసీఆర్‌ను గద్దెదించడానికి బండి సంజయ్ చాలు: తుక్కుగూడ సభలో అమిత్ షా..!!

Amit Shah bandi sanjay

Amit Shah bandi sanjay

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని..ప్రస్తుత సీఎం, నయానిజాం కేసీఆర్ ను గద్దె దించడానికి బండి సంజయ్ ఒక్కడూ చాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంకల్ప ప్రజాయాత్ర ముగింపు సందర్భంగా శనివారం హైదరాబాద్ శివారు ప్రాంతం తుక్కుగూడలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా కీలక వ్యాక్యలు  చేశారు. తెలంగాణలో నయా నిజాంను గద్దె దింపుదామా?వద్దా?అయితే మీరంతా పిడికిలి బిగించి నాతో ‘భారత్ మాతాకీ జై’అంటూ నినాదం చేయండి అంటూ క్యాడర్ లో షా ఉత్సాహం నింపారు.
అమిత్ షా మాటల్లో…
బండి సంజయ్ పాదయాత్రను చాలారోజుల నుంచి చూస్తున్నారు. ఇవాళ సభలో ఆయన ప్రసంగం విన్న తర్వాత ఏం అనిపించిందంటే…తెలంగాణలో కేసీఆర్ ను అధికారంలో నుంచి దించాలంటే నాలాంటి నేతలు అవసరం లేదు. సంజయ్ ఒక్కరు చాలు…సింగిల్ హ్యాండ్ తో టీఆర్ఎస్ ను కూల్చేస్తాడు. సంజయ్ పాదయాత్ర ఒక పార్టీకి వ్యతిరేకంగా సాగిందికాదు. ఒకరిని గద్దెదించాలనో ఉద్దేశ్యంతో చేసిందికాదు. కుటుంబ పాలనను అంతం  చేసేందుకు, రాష్ట్రంలో దళిత, గిరిజనుల కలలు సాకారం చేసేందుకు ఉద్దేశించింది. ఆ పనిలో భాగంగానే కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ ను పీకేసి అవతల పారేయబోతున్నామని షా వ్యాఖ్యానించారు.
ఆనాడు ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ కారణంగా తెలంగాణ ..భరతమాట ఒడిలోకి చేరింది. నేను తెలంగాణ యోధులను సర్మించుకుంటున్నాను. సురవరం ప్రతాపరెడ్డి,దాశరథిరంగాచార్య, పీవీ నరసింహారావులకు నివాళలర్పిస్తున్నాను. బండి సంజయ్ మండుటెండలో పాత్రయాత్ర చేయడం అమోఘమైందన్నారు.
మీ అందరికీ ఒక నెంబర్ చెబుతాను  6359119119.. ఈ నంబర్ కు మీరు మిస్ కాల్ ఇస్తే  బండి సంజయ్ కి మద్దతు పలికినట్లు. 2014లో బీజేపీకి నాలుగు సీట్లీచ్చారు.మరోరెండుసీట్లలోస్వల్ప తేడాతో ఓడాం. తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించారు. నీళ్లు నిధులు నియామాకాలు కేసీఆర్ పూర్తి చేయలేదు. ఒక్కసారి మోదీ ప్రభుత్వం వస్తే..ఉద్యమ ఫలితాలను సాధించి చూపిస్తాం.
https://twitter.com/AmitShah/status/1525515608322109440
మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం..
తెలంగాణలో మైనార్టీలకు కేటాయించిన రిజర్వేషన్లపై  అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మైనార్టీల రిజర్వేషన్లను  రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని షా ప్రకటించారు.
https://twitter.com/AmitShah/status/1525482272698531840