Site icon HashtagU Telugu

PK, KCR and Congress: అ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది!

Prashant Kishore KCR

Prashant Kishore KCR

తెలంగాణలో రానున్నఎలక్షన్స్ కోసం టిఆర్ఎస్ పార్టీ  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ తో గతంలో ఒప్పందం కుదుర్చుకుందనే వార్తలు వచ్చాయి. పీకే గురించి గతంలో మాట్లాడిన కేసిఆర్ ఆయనతో చాల ఏళ్లుగా తనకి స్నేహముందని, ఆయ‌న ఎప్పుడూ డబ్బులు తీసుకోడని దేశ రాజకీయాలపై ఆయనతో ఎన్నో చర్చలు చేసినట్టు తెలిపాడు. అయితే ఒకవైపు కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేస్తోన్న పీకే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షమైన టిఆర్ఎస్ పార్టీతో ఏకకాలంలో సంప్రదింపులు చేయడం అనేక అనుమానాలను రేపుతోంది.
శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశమైన పీకే ఆ పార్టీకి పునరుజ్జీవనం తేవడానికి 600 స్లైడ్స్ తో కూడిన ఒక భారీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి తన ప్లాన్ గురించి, పార్టీలో తన చేరిక గురించి మే 2లోగా  నిర్ణయం తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్‌కు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తాను ఇచ్చిన సలహాలు పాటించాలని ఒక ఆరు పాయింట్స్ పీకే చెప్పారట. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ 370 స్థానాల్లో పోటీ చేయాలని, మమతా బెనర్జీ, కేసీఆర్‌తో సహా ప్రాంతీయ నేతలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని ఆయన సూచించారని సమచారం. ఇక ఆ భేటీ అయిపోగానే నేరుగా హైదరాబాద్ వచ్చి రెండు రోజులుగా   ప్రగతి భవన్ లోనే మకాం వేసినట్టు  తెలుస్తోంది.
రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో ప్రత్యక్ష పోటీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ , వైఎస్సార్సీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ లకు పీకే  సలహాదారుగా ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ లోకి ఆయనోస్తే ఇబ్బంది అయ్యే అవకాశముందని కాంగ్రెస్ లోని ఒక వర్గం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర పార్టీలతో సంబంధాలు కట్ చేసుకుంటేనే పీకేని కాంగ్రెస్ లోకి ఆహ్వానిద్దామని కొంత మంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ తో దోస్తీ కోసం కేసిఆర్ ప్రయత్నిస్తున్నాడని, కలిసి పోటి చేయడానికి సోనియా ఒప్పుకుంటే కాంగ్రెస్ కు ఫండింగ్ చేయడానికి కూడా సిద్దంగా ఉన్నాడని ఇదే విషయాలు సోనియాతో మాట్లాడమని కేసిఆర్ పీకే ని కోరినట్టు కూడా టాక్ నడుస్తోంది. సోనియాతో జరిగిన సమావేశంలో ఈ ప్రస్తావనను తీసుకొచ్చిన పీకే … సోనియా వర్షన్ కేసీఆర్ కు చెప్పి ఆ విషయంపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పీకే కాంగ్రెస్ లో చేరే విషయంతో పాటు  కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొనే అంశంపై  సోనియా తీసుకునే నిర్ణయం పై  పీకే కేసిఆర్ దోస్తీ కొనసాగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.
Exit mobile version