Site icon HashtagU Telugu

Numaish : న్యూ ఇయర్ లో ‘‘నుమాయిష్’’ షురూ..!

Numaish

Numaish

ప్రతి ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే తెలంగాణకు ఓమిక్రాన్ ముప్పు ఉండటంతో నుమాయిష్ నిర్వహించాలా.. వద్దా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నుమాయిష్ సర్వం సిద్ధం కానుంది. ఈ మేరకు జనవరి 1 నుండి ఫిబ్రవరి 15, 2022 వరకు ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE) సొసైటీ నిర్ణయించింది. అయితే నగరంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల దృష్ట్యా, కోవిడ్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించడం ద్వారా 81వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, AIIE సొసైటీ నుమాయిష్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి వ్యాపారులను ఆహ్వానించే ప్రక్రియను పూర్తి చేసిన సొసైటీ స్టాళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.

ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకారం.. సందర్శకులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. ఎగ్జిబిషన్ ప్రాంగణమంతా గేట్లు తెరవడానికి ముందు ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని సొసైటీ నిర్ణయించింది. ‘నో మాస్క్ నో ఎంట్రీ’ ఖచ్చితంగా పాటించేలా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి సహాయంతో సందర్శకులకు ఆరోగ్య సేవలు అందించబడతాయి. అయితే నుమాయిషల్ వివిధ రకాల స్టాల్స్ ఎలా ఏర్పాటవుతాయో.. అక్కడక్కడ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

“ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అక్టోబర్‌లో జరిగిన 20 రోజుల మినీ నుమాయిష్‌లో కూడా మేము కఠిన జాగ్రత్తలు తీసుకున్నాం. అయితే నుమాయిష్ మునుపటితో పోలిస్తే తక్కువ స్టాల్స్ ఉంటాయి. సందర్శకులు గుమికూడకుండా ఉండేందుకు క్యూ లైన్స్ ఏర్పాటుచేసినట్టు’’ వివరించారు అధికారులు.