CM KCR: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన రద్దు.. కారణం ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన రద్దయింది. ఆగస్టు 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది.

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన రద్దయింది. ఆగస్టు 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే వాతావరణ శాఖ రిపోర్ట్ తో కేసీఆర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 23న మెదక్ లో సీఎం పర్యటిస్తారు. తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రిపోర్ట్ ఇచ్చింది. అందులో భాగంగా తెలంగాణకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆగస్టు 18 మరియు 19 తేదీలలో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉండగా పది రోజుల క్రితం వరకు తెలంగాణాలో భారీ వర్షాలు కురిశాయి.ఎన్నడూ లేనటువంటి వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 466.9 మిల్లీమీటర్లు కాగా, సగటున 582.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ప్రస్తుత రుతుపవనాల సగటు వర్షపాతం 363.3 మిల్లీమీటర్లకు మించి 450.1 మిల్లీమీటర్లకు చేరుకుంది. మారేడ్‌పల్లి, చార్మినార్‌ ప్రాంతాల్లో అత్యధికంగా 49 శాతం.

Also Read: Naga Chaitanya : పాపం చైతు..సమంత & విజయ్ ని ఆలా చూసి ఎలా తట్టుకుంటున్నాడో..?