YS Jagan : జ‌గ‌న్ ఎఫెక్ట్! తెలంగాణ‌లో అమ‌ర‌రాజా !

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దెబ్బ‌కు 9వేలా 500 కోట్ల ప్రాజెక్టు తెలంగాణ‌కు వ‌చ్చేసింది. నాలుగు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న అమ‌ర‌రాజా కంపెనీ , తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య భారీ ఒప్పందం కుదిరింది. అ

  • Written By:
  • Publish Date - December 2, 2022 / 04:36 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దెబ్బ‌కు 9వేలా 500 కోట్ల ప్రాజెక్టు తెలంగాణ‌కు వ‌చ్చేసింది. నాలుగు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న అమ‌ర‌రాజా కంపెనీ , తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య భారీ ఒప్పందం కుదిరింది. అటు త‌మిళ‌నాడు ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో విస్త‌రిస్తోన్న అమ‌ర‌రాజా గ్రూప్ కంపెనీలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి న‌చ్చ‌లేదు. ఏపీలోని ఆ కంపెనీల‌పై కక్ష్య‌క‌ట్టారు. ఫ‌లితంగా ఏపీలో విస్త‌రించాల్సిన ప్రాజెక్టు తెలంగాణకు వెళ్లింది.

అమర రాజా బ్యాటరీస్ పెట్టుబడులకు మంత్రి కేటీఆర్ రెడ్ కార్పెట్ తో మంత్రి కేటీఆర్ స్వాగ‌తం ప‌లికారు. 37 సంవత్సరాలుగా అమరరాజా సేవలందిస్తోంద‌ని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమని ప్ర‌శ‌సించారు. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తల కోసం అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. అమరరాజా పెట్టుబడులు పెట్టడం పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అమర రాజా గ్రూప్ కి చెందిన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ లిథియం ఇయాన్ గిగా ఫ్యాక్టరీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకొని శుక్ర‌వారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమర రాజా బ్యాటరీస్ ను విస్తరించాలని భావించిన గల్లా జయదేవ్, తమ సంస్థ కార్యకలాపాలను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తుంద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు.అమరరాజా గ్రూప్ తో నేడు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న క్రమంలో దీనిపై మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన అమర రాజా సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇది అని ఆయన పేర్కొన్నారు. అమర రాజా సంస్థ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు. మొత్తం మీద ఏపీలో పెట్టాల్సిన పెట్టుబ‌డులు తెలంగాణ‌కు రావ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌ను ప్ర‌శ్నిస్తోంది.