Site icon HashtagU Telugu

Allu Arjun: పుష్ప ప్రమోషన్ మీట్ లో ఉద్రిక్తత.. అభిమానులకు గాయాలు

Allu Arjun Fan Meet

Allu Arjun Fan Meet

పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫాన్స్ తో అల్లు అర్జున్ మీట్ ఏర్పాటు చేశారు. మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ మీట్ లో అల్లు అర్జున్‌ ఫాన్స్ తో మాట్లాడతారని, ఫాన్స్ తో ఫోటో సెషన్‌ ఉంటుందని ప్రకటించడంతో పాటు ఎంట్రీ పాసులు కూడా ఇచ్చేసారు. దాంతో అభిమానులు భారీగా అక్కడికి తరలివచ్చారు.

అయితే ఫ్యాన్‌ మీట్‌ ప్రోగ్రాం రద్దైందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎంట్రీ పాసులు కూడా ఇచ్చాక మీట్ ఎలా రద్దు చేస్తారని ఎన్‌ కన్వెన్షన్‌ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్‌ చేశారు. ఈ సంఘటనతో తోపులాట జరిగి పలువురు అభిమానులకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటనపై అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తన ఫాన్స్ కి మెసేజ్ ఇచ్చారు. ఇలా జరగడం బాధాకరమని ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అభిమానుల
ప్రేమ, అభిమానమే తనకు పెద్ద ఆస్తులని అల్లు అర్జున్ తన ఫాన్స్ కి తెలిపాడు.

Allu Arjun Reacted