‘హైడ్రా’ రంగనాధ్ (Hydra Ranganath)..ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల యజమానులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ (CM Revanth Reddy) హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..తాజాగా వందలమందికి నోటీసులు జారీ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
హైడ్రా తీరు ఫై పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ప్రశంసలు దక్కుతుండగా..BJP MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) మాత్రం రంగనాధ్ ఫై విమర్శలు కురిపించారు. ఆయన కమిషనరా? లేక పొలిటికల్ లీడరా? అని సందేహం వ్యక్తం చేశారు. రంగనాథ్ ఖాకీ బట్టలు వదిలి ఖద్దర్ బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు. కేవలం హిందువుల నిర్మాణాలనే కూలుస్తున్నారని ఆరోపించారు. అంతే కాదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని ఆరోపించారు. ఆయన పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. చెరువులో నిర్మించిన ఒవైసీ భవనానికి 6 నెలల సమయం ఇచ్చిన హైడ్రా ఎన్ కన్వెన్షన్తో పాటు పల్లా, మర్రి రాజశేఖర్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాత బస్తీకి వెళ్లే దమ్ము ప్రభుత్వానికి లేదా అని సవాల్ చేశారు.
ఇదిలా ఉంటె ఇప్పటివరకు అక్రమాలకు పాల్పడినవారిపై దృష్టించిన హైడ్రా.. చెరువుల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైడ్రా రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు.
Read Also : The Raja Saab : ప్రభాస్ ‘రాజాసాబ్’తో తమ నష్టాలు పూడ్చుకుంటాం అంటున్న నిర్మాత..