Site icon HashtagU Telugu

Alleti Maheshwar Reddy : రేవంత్ రెడ్డి ఎంతో అదృష్టవంతుడు – బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎంతో అదృష్టవంతుడు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో (Assembly ) ఆయన మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి ఒక స్థానంలో ఓడినప్పటికీ మరో స్థానంలో గెలిచి సీఎం అయ్యారన్నారు. గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ హామీలనే చదివించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 412 హామీలను ఇచ్చిందని, కానీ ఇప్పుడు కేవలం 6 గ్యారెంటీల గురించే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారం ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు? అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు తెలపలేదని, కేవలం మేజిక్ ఫిగర్‌కు దగ్గరి సీట్లతోనే గెలిపించారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రైతుబంధు రూ.15వేల ఇస్తామన్నారు.. ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారని.. బీజేపీ సైతం తెలంగాణకు మద్దతు తెలిపిందన్నారు. అయినా బీజేపీ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రజా వాణి ప్రతిరోజు అన్నారు. ఇప్పుడు వారానికి రెండు రోజులు అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, కామారెడ్డి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఓడిపోయిన సందర్భాలు లేవన్నారు. సీనియర్ మంత్రులందరి సలహాలు తీసుకొని రేవంత్ రెడ్డి ముందుకు సాగాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఐపీఎస్ కాదు… సీనియర్ మంత్రులు అందరూ కానిస్టేబుల్స్ కాదని సెటైర్లు వేశారు.

Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదు… ప్రజా స్టార్ – వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు