Telangana Political Party:TRS పార్టీ అధ్యక్షుడిగా పొంగులేటి ?

తెలంగాణలో కొత్త పార్టీ అవతరించబోతుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. విశేషం ఏంటంటే పార్టీ పేరును కూడా ఖాయం చేశారట. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.

  • Written By:
  • Updated On - April 12, 2023 / 11:46 AM IST

Telangana Political Party: తెలంగాణలో కొత్త పార్టీ అవతరించబోతుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. విశేషం ఏంటంటే పార్టీ పేరును కూడా ఖాయం చేశారట. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.

తెలంగాణ సెపరేట్ అయ్యాక సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెరాస పార్టీకి తిరుగులేకుండాపోయింది. విపక్షమే లేకుండా ప్రజలు తెరాసకు నీరాజనాలు పలికారు. తెలంగాణ పిత కెసిఆర్ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రం కోసం మొదలైన పోరాటం ఈనాటిది కాదు. గత 50 ఏళ్లుగా ఈ అంశం నానుతూ వస్తుంది. అందుకోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జైలుకు వెళ్లారు. కానీ తెలంగాణ తెచ్చింది కెసిఆర్ అని ప్రజల్లో బాగా నాటుకుపోయింది. తెలంగాణ అంటే కెసిఆర్ గుర్తుకు వచ్చే అంత ఇంపాక్ట్ కలిగించారు ఆ పార్టీ హైకమాండ్. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు అందుతాయని ప్రజలు ఆశపడ్డారు. కానీ చివరకు తెలంగాణ సెంటిమెంట్ గంగలో కలిసిపోయింది. తెలంగాణ 4 కోట్ల ప్రజలకోసం పుట్టిన తెరాస పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారింది. దీంతో తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైనట్టే. ఇదంతా పక్కనపెడితే… తెరాస పార్టీ మళ్ళీ ప్రాణం పోసుకోనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

TRS పార్టీ BRS అవతరించి దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ప్రణాళికలు రచిస్తూ ఉంది.  ఈ నేపథ్యంలో తెలంగాణాలో మరో TRS పార్టీ రంగంలోకి దిగబోతున్నట్టు స్పష్టం అవుతుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కొత్త పార్టీకి రంగం సిద్ధమైంది. పార్టీ పేరును రిజిస్టర్ చేసేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి పేరుతో పార్టీ నిర్మాణం జరగనుంది. అంటే టీఆర్ఎస్ పేరుతో పార్టీని స్థాపించబోతున్నారట. తెలంగాణ ప్రజల ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట పొంగులేటి. అయితే కొత్త పార్టీ అంశం చివరికి కెసిఆర్ వద్దకు చేరడంతో హైకమాండ్ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లిపై సస్పెన్షన్ వేటు వేసింది.

పార్టీ నుండి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లి తెలంగాణ అధికార పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. పంజరంలో నుండి బయటకు వచ్చినంత రిలీఫ్ గా ఉందని జూపల్లి అన్నారు. అసలు పార్టీ సభ్యత్యమే లేని నన్ను మీరెలా సస్పెండ్ చేస్తారంటూ చురకలంటించారు పొంగులేటి . కాగా.. కొత్తగా నిర్మితమవుతున్న తెరాస పార్టీ 15 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారని తెలుస్తుంది. ఇక కెసిఆర్ పాలనను వ్యతిరేకించే నేతలను ఒకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని సన్నిహిత వర్గాల సమాచారం. నిజానికి తెరాస పార్టీ మళ్ళీ పుడితే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే సీఎం కెసిఆర్ పలుమార్లు తెలంగాణ సెంటిమెంట్ ఏం  లేదు ఇకపై అంతా రాజకీయమే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దాంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా… రాష్ట్రాన్ని గాలికి వదిలేసి దేశ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రజలు అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. మొత్తానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పేరు మారుమ్రోగనుంది.