All Party meeting : అఖిప‌క్షం వెనుక రేవంత్! కోదండ‌రాం బ్ర‌హ్మాస్త్రం

విప‌క్షాల‌న్నీ ఏకం(All party meeting) కావ‌డానికి తెలంగాణలో ముందడుగు ప‌డింది. అందుకు, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం(Kodanda ram) న‌డుంబిగించారు.

  • Written By:
  • Updated On - April 20, 2023 / 11:15 AM IST

విప‌క్షాల‌న్నీ ఏకం(All party meeting) కావ‌డానికి తెలంగాణలో ముందడుగు ప‌డింది. అందుకు, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం(Kodanda ram) న‌డుంబిగించారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ ఆయ‌న ర‌థ‌సార‌థిగా ఉన్నారు. తెలంగాణ రాజ‌కీయ జేఏసీ చైర్మ‌న్ గా ఉంటూ ఉద్య‌మాన్ని న‌డిపారు. తెర వెనుక కేసీఆర్ ఉన్న‌ప్ప‌టికీ ఫేస్ మాత్రం కోదండ‌రాం క‌నిపించే వాళ్లు. అందుకే, యూనివ‌ర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఫ‌లితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది.

విప‌క్షాల‌న్నీ ఏకం కావ‌డానికి తెలంగాణలో ముందడుగు(All party meeting) 

ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం ఎలాంటి ప్ర‌య‌త్నం కోదండరాం(Kodanda ram) చేశారో, అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు విప‌క్షాల‌ను ఏకం (All party meeting) చేయ‌డానికి సిద్ద‌మ‌య్యారు. అందులో భాగంగా తొలి అడుగు ఇందిరాపార్క్ వేదిక‌గా జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశం రూపంలో ప‌డింది. పైగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నుంచి లీకైన ప‌రీక్షా ప‌త్రాల అంశాన్ని తీసుకున్నారు. ఆ అంశం పూర్తిగా నిరుద్యోగులు, విద్యార్థుల‌కు సంబంధించిన ఇష్యూ. రాష్ట్రంలోని సుమారు 30ల‌క్ష‌ల మందికి సంబంధించిన అంశం. అందుకే, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం స‌రైన స‌మ‌యంలో రంగంలోకి దిగారు. అయితే, ఆయ‌న వెనుక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నార‌ని కాంంగ్రెస్ వ‌ర్గాల్లోని టాక్‌.

ప్రొఫెస‌ర్ కోదండ‌రాం స‌రైన స‌మ‌యంలో రంగంలోకి

పూర్వం నుంచి ప‌టేల్, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ ద్వారా తెలంగాణ గ్రామాల్లో `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం ఆధిప‌త్యం ఉండేది. మిగిలిన సామాజిక‌వ‌ర్గాల‌ను న‌డిపించేలా అప్ప‌ట్లో ఆ వ‌ర్గం ఉండేద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. కానీ, ప‌టేల్, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ పోయిన త‌రువాత క్ర‌మంగా `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం రాజ‌కీయంగా బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌చ్చింది. వెల‌మ సామాజిక‌వ‌ర్గానికి ఎక్కువ‌గా భూములు ఉండేవి. ఆనాడు న‌క్స‌ల్స్ ప్ర‌భావం కార‌ణంగా వెల‌మ పెద్ద‌లు హైద‌రాబాద్ న‌గ‌రానికి పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చార‌ని చ‌రిత్ర చెబుతోంది. అందుకే ఇప్ప‌టికీ తెలంగాణ గ్రామాల్లోని భూముల ప‌త్రాలు వెల‌మ సామాజిక‌వ‌ర్గం పెద్ద‌ల పేరు మీద ఎక్కువ‌గా ఉంద‌ని రికార్డుల ద్వారా తెలుస్తోంది. తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన థ‌ర‌ణీ పోర్ట‌ల్ ద్వారా ఆ భూముల‌ను తిరిగి వెల‌మ పెద్ద‌లు సొంతం చేసుకుంటున్నార‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తోన్న ఆరోప‌ణ‌. అందుకే, అధికారంలోకి వ‌స్తే థ‌ర‌ణీ పోర్ట‌ల్ ర‌ద్ద మీద తొలి సంత‌కం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం కావాల‌ని పోరాడుతోన్న ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్

రాజ్యాధికారం `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం చేతిలో ఉండాల‌ని రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌. ఆ దిశ‌గా అడుగులు వేస్తూ కాబోయే సీఎంగా ఆయ‌న ఫోక‌స్ అవుతున్నారు. అయితే, కేసీఆర్ స‌ర్కార్ ను ప‌డేసేందుకు మిగిలిన సామాజిక‌వ‌ర్గాలు, పార్టీలు క‌లిసి రావాలి. కేవ‌లం కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా పోరాడ‌డం కంటే మిగిలిన ప‌క్షాల‌ను కూడా క‌లుపుకుని వెళ్లాలి. అందుకు రేవంత్ రెడ్డి సార‌థ్యం వహిస్తే, మిగిలిన ప‌క్షాలు క‌లిసొచ్చే అవ‌కాశం త‌క్కువ‌. అందుకే, ప్రొఫెస‌ర్ కోదండ‌రాంను(Kodanda ram) కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింద‌ని స‌మాచారం. వాస్త‌వంగా కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న పార్టీ తెలంగాణ జ‌న‌స‌మితిని కాంగ్రెస్లో విలీనం చేస్తార‌ని కూడా అప్ప‌ట్లో బ‌లంగా ప్ర‌చారం జ‌రిగింది.

Also Read : T Congress :రేవంత్ మార్క్ ,ప్రేమ్ సాగ‌ర్ రావుకు ఎస‌రు

తెలంగాణ సీఎం కేసీఆర్ తో చెడిన త‌రువాత కోదండ‌రాం మిగిలిన ప‌క్షాల‌తో (All party meeting) క‌లిసి న‌డుస్తున్నారు. బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం కావాల‌ని పోరాడుతోన్న ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తోనూ చేతులు క‌లిపారు. ఇప్పుడు ప్ర‌ధాన పార్టీల‌తో పాటు చిన్నాచిత‌క పార్టీల‌ను కూడా ఇందిరాపార్క్ వ‌ద్ద జ‌రిగిన అఖిల‌ప‌క్షం వేదిక‌పైకి కోదండ‌రాం తీసుకురాగ‌లిగారు. ఇలాంటి ప‌రిణామం పీసీసీ చీఫ్. రేవంత్ రెడ్డికి కావాలి. అందుకే, బ్ర‌హాస్త్రంగా కోదండ‌రాంను ఉప‌యోగించారు. ప్ర‌భుత్వం మీద ఐక్య పోరాడానికి రేవంత్ వ్యూహం ప్ర‌కారం ఒక అడుగు ముందుకు ప‌డింది. రాబోవు రోజుల్లో కోదండరాం ఫేస్ ను చూపిస్తూ తెర వెనుక రేవంత్ రాజ‌కీయం న‌డ‌బోతున్నార‌న్న‌మాట‌.

Also Read : Karnataka Congress: కర్నాటక ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ నేతలు!