Site icon HashtagU Telugu

TS Polls 2023 : రూ.1కే నాల్గు గ్యాస్ సిలిండర్లు..హైదరాబాద్ లో AIFB అభ్యర్థి హామీ

TS Polls 2023

Gas

ఎన్నికలు (Elections) వచ్చాయంటే చాలు రాజకీయ నేతలు రకరకాల హామీలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడతారు. ఓ పార్టీ పలు హామీలు ప్రకటిస్తే..వాటికీ రెట్టింపు గా మరో పార్టీ ప్రకటించి ఓట్లు దండుకోవాలని చూస్తుంటుంది. ప్రస్తుతం తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు వారి హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను తెలుపుతున్నాయి. రూ.500కే గ్యాస్ (Gas) సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్‌ అంటే.. రూ.400లకే మీము ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రెండు పార్టీలు ఇలా చెపితే..రూ.1 కే నాల్గు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఓ జాతీయ పార్టీ గ్యాస్ సిలిండర్లపై సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచింది. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ (All India Forward Block Party) తరపున సనత్‌నగర్‌ నుంచి పోటీ చేస్తున్న కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌ (Kummari Venkatesh yadav) ఈ ప్రకటన చేసారు. నన్ను గెలిపిస్తే.. ఏడాదికి కేవలం రూ.1కే నాలుగు సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు.. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం.. అలాగే రూపాయికే న్యాయ సలహాలిస్తానని అంటున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని.. 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్‌ బటన్‌ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. కూటి కోసం కోటి విద్యలన్నట్లు.. ఓట్ల కోసం నేతలు కీలక హామీలు ఇస్తున్నారు. ఉచితాలు, సంక్షేమపథకాలతో ఎన్నికల క్షేత్రంలోకి వెళ్తున్నారు. అయితే ఓటర్లు ఎవరి వైపు మెుగ్గు చూపుతారో చూడాలి.

Read Also : Jayaprada : జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్.. యూపీ కోర్టు కీలక ఆదేశాలు