Site icon HashtagU Telugu

Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం రూ.450 నుంచి రూ.27లక్షలు

Balapur Ganesh Laddu Auction

Balapur Ganesh Laddu Auction

Balapur Ganesh Laddu Auction: 10 రోజుల వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ (Balapur Ganesh) లడ్డూ వేలంపై అందరి దృష్టి పడింది. గతేడాది ఈ లడ్డూను రూ.27 లక్షలకు వేలం వేయగా దాసరి దయానంద్ రెడ్డి కొనుగోలు చేశారు. అయితే గణేష్ లడ్డూ వేలం ఈ నాటిది కాదు. 1994 నుంచి గణేష్ లడ్డూని వేలం(Laddu Auction) వేస్తున్నారు. స్థానిక రైతు కొలన్ మోహన్ రెడ్డి తొలి వేలంలో 450 రూపాయలకు కొనుగోలు చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఒకే కుటుంబం అనేక వేలంపాటల్లో పాల్గొంది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

1994 నుండి గతేడాది వరకు హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో దక్కించుకున్న వారి జాబితా:

1994 – కొలను మోహన్ రెడ్డి రూ. 450.
1995 – కొలను మోహన్ రెడ్డి రూ. 4,500.
1996 – కొలను కృష్ణా రెడ్డి రూ. 18 వేలు.
1997 – కొలను కృష్ణా రెడ్డి రూ. 28వేలు.
1998 – కొలను మోహన్ రెడ్డి రూ. 51 వేలు.
1999 – కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65 వేలు.
2000 – కల్లెం అంజిరెడ్డి రూ. 66 వేలు.
2001- జి.రఘునందన రెడ్డి రూ. 85 వేలు.
2002 – కందాడ మాదవ్ రెడ్డి రూ.లక్షా 5వేలు.
2003 – చిగిరింత బాల్ రెడ్డి రూ. లక్షా , 55వేలు.
2004 -కొలను మోహన్‌రెడ్డి రూ. 2 లక్షల ఒక వేయి.
2005 – ఇబ్రహిం శేఖర్ రూ. 2లక్షల, 8వేలు.
2006 – చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3 లక్షలు.
2007 – జి.రఘునందనాచారి రూ. 4 లక్షల 15వేలు.
2008 – కొలను మోహన్‌రెడ్డి రూ. 5లక్షల, 7వేలు.
2009 – సరిత రూ. 5లక్షల 10వేలు.
2010 – శ్రీధర్‌బాబు రూ. 5 లక్షల, 35వేలు.
2011 – కొలను ఫ్యామిలీ రూ. 5 లక్షల,45 వేలు.
2012 – పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7 లక్షల,50 వేలు.
2013 – తీగల కృష్ణారెడ్డి రూ. 9 లక్షల,26 వేలు.
2014 – సింగిరెడ్డి జయేందర్ రెడ్డి రూ. 9 లక్షల,50 వేలు.
2015 – కళ్లెం మదన్‌మోహన్‌ రూ. 10 లక్షల,32వేలు.
2016 – స్కైలాబ్ రెడ్డి రూ. 14లక్షల,65వేలు.
2017 – నాగం తిరుపతి రెడ్డి రూ. 15లక్షల, 60 వేలు.
2018 – శ్రీనివాస్ గుప్తా రూ.16లక్షల.60 వేలు.
2019 – కొలను రాంరెడ్డి రూ.17 లక్షల 60 వేలు.
2020 – కరోనా కారణంగా వేలం జరగలేదు. ఆ అప్పటి సీఎం కేసీఆర్ కు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
2021 – మర్రి శశాంక్‌ రెడ్డి రూ.18 లక్షల 90 వేలు. .
2022 – వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24 లక్షల 60 వేలు.
2023 – దాసరి దయానంద్‌రెడ్డి రూ.27 లక్షలు
ఈ ఏడాది లడ్డూ వేలంలో 30 లక్షలు పలికే అవకాశం ఉందంటున్నారు.

ఇదిలా ఉండగా గణేష్ నిమజ్జన ఊరేగింపుకు సంబంధించిన మార్గాలను హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 17, మంగళవారం నాడు ఊరేగింపుల కోసం ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు.ట్రాఫిక్ సజావుగా సాగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇది మంగళవారం ఉదయం నుండి బుధవారం మధ్యాహ్నం వరకు అమలులో ఉంటుంది.

Also Read: Trump Golf Course: ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం.. నిందితుడు ఎవరంటే ?