Telangana Results : అందరి చూపు కామారెడ్డి ..గజ్వేల్ రిజల్ట్ పైనే..

బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారంటున్నారు

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 07:45 AM IST

మరికాసేపట్లో తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు సంబదించిన లెక్కింపు మొదలుకాబోతుంది. ఎవరు గెలుస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి..టెన్షన్ నెలకొని ఉంది. కాగా రాష్ట్ర ప్రజలతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆసక్తిగా కామారెడ్డి ..గజ్వేల్ ఫలితాల గురించి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు స్థానాల్లో గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఓ వైపు కేసీఆర్ బరిలో నిల్చుంటే..మరోవైపు బిజెపి నుండి ఈటెల రాజేందర్ , కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి లు బరిలో నిల్చున్నారు. దీంతో గెలుపు ఎవర్ని వరిస్తుందనేది ఆసక్తి గా మారింది.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన కేసీఆర్ అస్త్రాలు శస్త్రాలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో రెడీగా ఉంటారు..కానీ ఈసారి ఎందుకో తడబడ్డట్లే కనిపిస్తున్నారు. సాధారణంగా ఎప్పుడైనా ఓ చోట నుండే పోటీ చేసే కేసీఆర్..ఈసారి రెండు చోట్ల పోటీ చేయాలనుకోవడం మొదటి మైనస్ గా చెబుతున్నారు. ఎప్పుడైతే రెండు చోట్ల పోటీ చేస్తానని కేసీఆర్ స్వయంగా ప్రకటించారో.. అప్పటి నుంచే రాష్ట్ర ప్రజల ఆలోచన పూర్తిగా మారిపోయిందంటున్నారు. ఎందుకంటే ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డి వెళ్తున్నారని కాంగ్రెస్ విపరీతంగా ప్రచారం చేసింది. అటు కేసీఆర్ కూడా కామారెడ్డి వెళ్లడం వెనుక ప్రత్యేక కారణాలు చెప్పలేకపోయారు. పైగా గజ్వేల్ ప్రతినిధులతో మీటింగ్ పెట్టినప్పుడు తాను గజ్వేల్ వదిలి ఎక్కడికీ వెళ్లబోనని చెప్పడంతో రెంటికీ చెడ్డ రేవడి మాదిరి అయిందంటున్నారు. మరి ఈ రెండు చోట్ల కేసీఆర్ విజయం సాధిస్తారా..? లేదా అనేది ఇప్పుడు చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

ఎందుకంటే గజ్వేల్ లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో ఫలితం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. 4.4 శాతం పోలింగ్ తగ్గడం సీఎం కేసీఆర్ గెలుపు లేదా మెజార్టీ పై ప్రభావం చూపుతుందా అనే చర్చ నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన గజ్వేల్​లో సీఎం కేసీఆర్ తో బీజెపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడ్డారు. గజ్వేల్​లో వార్ వన్ సైడ్ అవుతుందని అందరూ భావించినా.. అనూహ్యంగా బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలోకి దిగడంతో చివరి వరకు పోటా పోటీగా పోలింగ్ ​సాగింది. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ​తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై 58,290 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ ఈసారి కేసీఆర్ పై గజ్వేల్ జనం గరంగరంమైనట్లు సర్వే రిపోర్టులు తెరపైకి వచ్చాయి. నియోజకవర్గానికి కేసీఆర్ వెళ్లలేకపోయారని, అక్కడి స్థానిక నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండలేకపోవడం మైనస్ అయ్యాయి. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థితో పోటీ పడగా బీజేపీ అభ్యర్థి నామమాత్రానికే పరిమితమయ్యారు. పోలైన ఓట్లలో లక్షకు పైగా కేసీఆర్ సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. మరి గెలుపు ఎవర్ని వరిస్తుందో మరికాసేపట్లో తేలనుంది.

Read Also : Telangana Election Results : కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్..అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్