Site icon HashtagU Telugu

Congress : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ కు భారీ షాక్ తగలబోతుందా..?

Aligireddy Praveen Reddy

Aligireddy Praveen Reddy

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హావ కొనసాగుతూ వస్తుంది. పదేళ్ల బిఆర్ఎస్ ను ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేసిన కాంగ్రెస్…ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ అడ్రెస్ లేకుండా చేయడమే కాదు..తెలంగాణ లో అసలు బిఆర్ఎస్ (BRS) అనేది లేకుండా చేయాలనీ రేవంత్ & టీం ప్లాన్ చేస్తుంది. దీనికి తగ్గట్లే పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకొని వారికీ కీలక బాధ్యతలు , పదవులు అప్పగించారు. ఇక ఇప్పుడు ఎంపీ బరిలో కూడా పలువుర్ని నిల్చుపెట్టారు. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ కు ఓ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో పలువురు నేతలు చేరుతూ వస్తుండగా..ఇక ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నుండి ఓ కీలక నేత బయటకు వెళ్లేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి (Aligireddy Praveen Reddy) కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కరీంనగర్‌ పార్లమెంట్ టికెట్ వెలిచాలకే ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగడంతో.. తనకు టికెట్ రాదని అసంతృప్తి తో పార్టీ ఫై ఆగ్రహం గా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల టైంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోసం తన సీటును త్యాగం చేశారు అలిగిరెడ్డి. తనకోసం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన అలిగిరెడ్డికి ఎంపీ టికెట్ ఇప్పిస్తానంటూ పొన్నం ప్రభాకర్‌ మాట ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఆ మాట ప్రకారం కరీంనగర్ ఎంపీ బరిలో వెలిచాల పేరు గట్టిగా వినిపిస్తుండడంతో అలిగిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారట. తనకు కాకుండా వేరే వ్యక్తి కి ఇస్తే పార్టీ కి రాజీనామా చేయాలనీ అనుకుంటున్నాడట. ఇదే క్రమంలో ఆయన బిజెపి లో చేరాలని భావిస్తున్నాడట. మరి రేవంత్ ..ప్రవీణ్‌ రెడ్డి తో మాట్లాడి బుజ్జగిస్తాడా..? లేక లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.

Read Also :Akhil : అతి త్వరలో కింగ్ నాగార్జున ఇంట పెళ్లి సందడి..?