Site icon HashtagU Telugu

Ration Card KYC : రేపే లాస్ట్ డేట్.. ఈ-కేవైసీ చేసుకోలేదో రేషన్ కార్డు కట్

Ration Card Kyc

Ration Card Kyc

Ration Card KYC : బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు డెడ్ లైన్ ముంచుకొస్తోంది. రేషన్ కార్డును కొనసాగించడంలో కీలకమైన ఈ-కేవైసీ ప్రక్రియను చేసుకునేందుకు రేపే (ఫిబ్రవరి 29)  లాస్ట్ డేట్. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డు ఈ-కేవైసీని దగ్గర్లోని రేషన్ దుకాణంలో చేసుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్రం.. మరోమారు పొడిగించే అవకాశం లేదు.ఈ కేవైసీ చేసుకోకుంటే.. రేషన్ కార్డు కట్ అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ తెలంగాణలో గత ఐదు నెలలుగా కొనసాగుతోంది. రాష్ట్రం ఇప్పటి వరకు 75 శాతం మంది రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకునున్నారు. ఇంకా 25 శాతం మంది రేషన్ కార్డు ఈ కేవైసీ (Ration Card KYC) చేసుకోవాల్సి ఉంది. వారు ఈ రెండు రోజుల్లోనే చేసుకోవాలి. ఈ కేవైసీ కోసం సమీపంలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి.. రేషన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్ ఇవ్వాలి. రేషన్ డీలర్ ఆ వివరాలను బయోమెట్రిక్ మిషన్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత మనం బయెమెట్రిక్ (వేలిముద్రలు) ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకున్న వారి పేరు ఉంచి.. మిగతా వారి పేర్లను తొలగించనున్నారు. రాష్ట్రంలోని ఏ రేషన్ షాపు వద్ద అయినా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్లాల్సిన అవసరమూ లేదని, వీలును బట్టి విడివిడిగా వెళ్లి పూర్తిచేయొచ్చని అధికారులు చెప్పారు. అయితే తెలంగాణలో చాలా మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. వారి కోసం రేషన్ కార్డు ఈకేవైసీ గడుపు పెంచాలని కోరుతున్నారు.దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. ఇది ఎన్నికల టైం అయినందున ఈ-కేవైసీ గడువును పెంచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.