Traffic Challans : నేడే లాస్ట్ డేట్.. డిస్కౌంటుతో ట్రాఫిక్ ఛాలాన్లు కట్టేయండి

Traffic Challans : మీ ట్రాఫిక్ ఛాలాన్ పెండింగ్ ఉందా? డిస్కౌంట్‌తో పేమెంట్ చేసేందుకు ఇవాళే లాస్ట్ డేట్.

Published By: HashtagU Telugu Desk
Technical Glitches

Traffic

Traffic Challans : మీ ట్రాఫిక్ ఛాలాన్ పెండింగ్ ఉందా? డిస్కౌంట్‌తో పేమెంట్ చేసేందుకు ఇవాళే లాస్ట్ డేట్. ఎందుకంటే ట్రాఫిక్ ఛాలాన్ల చెల్లింపు కోసం పోలీసులు ఇచ్చిన రాయితీ గడువు ఈరోజుతో ముగియనుంది. డిస్కౌంట్‌తో ఇవాళ పేమెంట్ చేయకపోతే మొత్తం పెండింగ్ అమౌంటును కట్టాల్సి ఉంటుంది.  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారిపై తెలంగాణ పోలీసులు జరిమానాలు విధించారు. ఈ బకాయిలు చాలా రోజులుగా పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో  కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఛాలాన్లు(Traffic Challans) క్లియర్ చేసుకునే వారికి రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join

గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ రాయితీల చెల్లింపులను తీసుకుంటున్నారు. అయితే పెండింగ్ చలాన్ల చెల్లింపుల విషయంలో వచ్చిన స్పందన చూసి రాయితీ గడువును జనవరి 31 వరకు పొడిగించారు. పోలీసులు ఇచ్చిన తుది గడువు ఈరోజుతో ముగియనుంది. పెండింగ్ చలాన్లపై రాయితీని గతేడాది డిసెంబర్ 27 నుంచి జనవరి 10 వరకే అవకాశం కల్పించింది. దాని తర్వాత మరోసారి గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఈసారి మాత్రం ఇదే లాస్ట్ చాన్స్ అని ..ఫిబ్రవరి 1 నుంచి రాయితీ వర్తించదని పోలీసులు అంటున్నారు.

ఆన్ లైన్లో పెండింగ్ ట్రాఫిక్ ఛాలాన్ల పేమెంట్ ఇలా.. 

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్‌ను ఓపెన్ చేయండి.
  • మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత Recharge & Pay Billsపై క్లిక్ చేయండి. Challan పైన క్లిక్ చేయండి.
  • Traffic Authority పైన క్లిక్ చేసి Telangana Traffic Police పైన క్లిక్ చేయండి.
  • వెహికిల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మీ వాహనంపైన ఉన్న పెండింగ్ చలాన్లు కనిపిస్తాయి.
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, పేటీఎం వ్యాలెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, యూపీఐ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చు.
  • పేటీఎం వెబ్‌సైట్‌లో కూడా దాదాపు ఇదే ప్రాసెస్‌తో పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చు.

ట్రాఫిక్ పోలీసులు బైకులు, ఆటోల‌కు 80 శాతం రాయితీ ఇచ్చారు. ఆర్టీసీ బ‌స్సుల‌కు 90 శాతం, లారీ వంటి భారీ వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించారు. రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు ఈరోజుతో ముగియనుంది.  ఈ అవకాశాన్ని వాహనదారులు వాడుకుంటే ఎంతో డబ్బు ఆదా అవుతుంది.

  Last Updated: 31 Jan 2024, 08:05 AM IST