Site icon HashtagU Telugu

Akunuri Murali On Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఫై ఆకునూరి మురళీ సంచలన వ్యాఖ్యలు..

Akunuri Murali Sensational

Akunuri Murali Sensational

స్మితా సభర్వాల్ (Smita Sabharwal)… ఈ పేరు తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చిరపరిచితమే. బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) ఉన్న సమయంలో కేసీఆర్ (KCR) మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో (CMO) ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ (EX IAS Akunuri Murali) తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మురళి సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ( ఎక్స్) లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టారు.

గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం కొంత మంది ఐఏఎస్ లకు ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రంకు పంపకుండా చర్యలు తీసుకోవాలి.. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని వ్యాఖ్యానించారు. అంతే కాదు దేశం మొత్తంలో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమె గారే అంటూ స్మితా సబర్వాల్ ను ఉద్దేశించి ట్వీట్ చేసారు.

మొన్నటివరకు కేసీఆర్ టీమ్ లో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్.. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు.

కొత్త సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులు అంతా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ, స్మితా సబర్వాల్ మాత్రం ఇంతవరకు సీఎం రేవంత్ ను కలవలేదు. తన భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. తాను కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. తాజాగా స్మితా సబర్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. కొత్త ఛాలెంజ్ లకు ఎప్పుడూ సిద్ధమే అంటూ పోస్టు పెట్టారు. దీనిని బట్టి చూస్తే స్మితా తెలంగాణ కు బై బై చెప్పబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీసులోకి ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి జాయిన్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Read Also  : Three CMs – One Plan : ముగ్గురు కొత్త సీఎంలు.. ఒక పొలిటికల్ ప్లాన్