Akbaruddin: పోలీసులకు అక్బరుద్దీన్ వార్నింగ్.. వీడియో వైరల్

సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది రోజులే మిగిలి ఉండగానే తెలంగాణలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది.

Published By: HashtagU Telugu Desk
Akbar Imresizer

Akbar Imresizer

Akbaruddin: సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది రోజులే మిగిలి ఉండగానే తెలంగాణలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. నేతలు ఏం మాట్లాడుతున్నారో అందరూ నిశితంగా గమనిస్తున్నారు. (AIMIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు చేసిన వీడియో సంచలనం సృష్టించింది. అతను పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ పలువురిని ఉలిక్కిపడేలా చేసింది. అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు. సంబంధిత పోలీసు ఇన్‌స్పెక్టర్ కేటాయించిన సమయం ముగిసిందని, స్పీచ్ ముగించాలని గుర్తు చేశాడు. ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని ఎమ్మెల్యే చెప్పారు.

అక్కడితో ఆగకుండా తాను సిగ్నల్ ఇస్తే పోలీసులు పరుగులు తీయాల్సిందేనని అన్నారు. మిమ్మల్ని పరుగెత్తించాలా అని అడిగాడు. “నేను సిగ్నల్ ఇస్తే మీరు పరుగెత్తాలి, మనల్ని బలహీనపరిచేందుకే ఇలా వస్తున్నారని నేను చెబుతున్నాను’’ అన్నాడు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల సహకారంతో ఏఐఎంఐఎం నేరపూరిత సంస్థగా మారిందని, అక్బరుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

 

  Last Updated: 22 Nov 2023, 05:47 PM IST