Air Quality Today : తాజాగా ఈరోజు (నవంబరు 24) తెల్లవారుజామున మన దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత ఎలా ఉందనే సమాచారంతో ఒక నివేదికను విడుదల చేశారు. ఇందులోనూ గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయిలో ఉన్న నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)లో పాయింట్లు ఎంత ఎక్కువగా ఉంటే.. గాలి నాణ్యత అంతగా డౌన్ అయినట్టు లెక్క. ప్రధాన నగరాల తాజా ఏక్యూఐ గణాంకాలతో విడుదల చేసిన లిస్టు ప్రకారం.. ఇవాళ ఢిల్లీలో అత్యధికంగా 366 పాయింట్ల ఏక్యూఐ ఉంది. ఏక్యూఐ స్థాయులు 300 పాయింట్లు దాటితే దాన్ని ‘వెరీ పూర్’ (చాలా దారుణం) అనే కేటగిరీలో చేరుస్తారు. అంటే.. గాలి నాణ్యత బాగా దెబ్బతిందని అర్థం. రెండో స్థానంలో నిలిచిన పాట్నా (బిహార్ రాజధాని)లో 295 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది. మూడో స్థానంలో ఉన్న చండీగఢ్‌లో 242 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది.
Also Read :PM Modi : ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోడీ
భోపాల్ (మధ్యప్రదేశ్)లో 232 పాయింట్ల ఏక్యూఐ, కోల్‌కతా(బెంగాల్)లో 219 పాయింట్ల ఏక్యూఐ, భువనేశ్వర్ (ఒడిశా)లో 218 పాయింట్ల ఏక్యూఐ, జైపూర్ (రాజస్థాన్)లో 214 పాయింట్ల ఏక్యూఐ నమోదయ్యాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై (మహారాష్ట్ర)లో 193 పాయింట్ల ఏక్యూఐ, భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరు (కర్ణాటక)లో 102 పాయింట్ల ఏక్యూఐ నమోదయ్యాయి. మన హైదరాబాద్‌లో 125 పాయింట్ల ఏక్యూఐ లెవల్స్ నమోదయ్యాయి. చెన్నైలో 105 పాయింట్ల ఏక్యూఐ లెవల్స్ నమోదయ్యాయి.
Also Read :Yashasvi Jaiswal: సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్!
కేరళలోని తిరువనంతపురంలో కేవలం 65 పాయింట్ల ఏక్యూఐ లెవల్స్(Air Quality Today) ఉన్నాయి. అంటే అక్కడి గాలి నాణ్యత మన దేశంలోని ఇతర నగరాల కంటే చాలా బెటర్‌గా ఉంది. వాయు కాలుష్యం తక్కువగా ఉండటం వల్ల అక్కడి గాలి నాణ్యత ఇంకా బెటర్‌గానే ఉంది. కర్ణాటకలోని చామరాజనగర్‌లో దేశంలోనే బెస్ట్ గాలి నాణ్యత ఉంది. అక్కడ ఏక్యూఐ లెవల్స్ 44గా నమోదయ్యాయి. వాయు కాలుష్య స్థాయులు తక్కువగా ఉన్నచోట గాలి నాణ్యత ఇంత బెటర్‌గా ఉంటుంది. మిజోరంలోని ఐజ్వాల్‌లో 50 పాయింట్ల ఏక్యూఐ , అసోంలోని గువహతిలో 82 పాయింట్ల ఏక్యూఐ నమోదయ్యాయి.