హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Air India Flight) టేకాఫ్ అయిన కేవలం 16 నిమిషాల్లోనే తిరిగి హైదరాబాద్‌కు రావడం సంచలనం రేపింది. శనివారం ఉదయం 6:41 గంటలకు బయలుదేరిన ఈ విమానం, 6:57కి తిరిగి వేలకు చేరుకోవడం టెన్షన్ నెలకొనేలా చేసింది. దీంతో ఈ ఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Ash Gourd : బూడిద గుమ్మడికాయ..దిష్టికే కాదు..సర్వరోగ నివారిణి !
బోయింగ్ 737 మాక్స్ 8 విమానం ఐఎక్స్110గా నమోదైన ఈ విమానం ఉదయం 11:45కి ఫుకెట్‌లో ల్యాండ్ కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో మధ్యలోనే తిరిగి రావాల్సి వచ్చింది. విమానయాన సంస్థ నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు విమానం లోపలే నిరీక్షించాల్సి రావడం వారిలో అసహనాన్ని కలిగించింది. “మేము లోపల వేచి ఉన్నాం. ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా నిరాశాజనకం” అంటూ ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘ఎక్స్’ (Twitter) వేదికగా స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా విమానం తిరిగి వచ్చిందని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేసింది. భద్రతే తమకు ప్రధాన ప్రాముఖ్యత అని స్పష్టంగా తెలిపింది. ఇటీవల విమానయాన రంగంలో వరుస సాంకేతిక సమస్యలు ఎదురవుతుండగా, ఈ తాజా ఘటన మరోసారి ప్రయాణికుల్లో ఆందోళనను పెంచింది.