Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డి తీరుపై ఎంఐఎం నాయ‌కులు ఆగ్రహం

మ‌ర్యాద ఇవ్వాల‌ని కోమ‌టిరెడ్డి ముస్లిం నాయ‌కులకు సూచించారు. దీంతో కోపంతో ఊగిపోయిన స‌ద‌రు నాయ‌కుడు.. అస‌లు మీకు ఎందుకు మర్యాద ఇవ్వాలంటూ ప్ర‌శ్నించారు

Published By: HashtagU Telugu Desk
Mim Kvr

Mim Kvr

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కొంతమంది నేతలు తరుచు వివాదాల్లో నిలుస్తున్నారు. ముఖ్యముగా రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి (Komatireddy Venkat Reddy). ఆ మధ్య దళిత బంధు విషయంలో నోరు జరగా..దానిపై బిఆర్ఎస్ పెద్ద ఆందోలన చేసింది. ఆ తర్వాత కూడా పలు వివరాల్లో ఈయన పేరు నిలిచింది. తాజాగా ఇప్పుడు ఎంఐఎం నాయ‌కుల‌తో తాను మాట్లాడన‌ని కోమ‌టిరెడ్డి అనడం ఫై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కోమటిరెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

అసలు ఏంజరిగిందంటే..

We’re now on WhatsApp. Click to Join.

సీఏఏ మీద కాంగ్రెస్ ప్ర‌భుత్వం స్టాండ్ ఏంట‌ని ఓ ముస్లిం నాయ‌కుడు కోమ‌టిరెడ్డిని ప్ర‌శ్నించారు. ఆ నాయ‌కుడి మెడ‌లో ఎంఐఎం (AIMIM) పార్టీ కండువా ఉండ‌డంతో.. ఎంఐఎం నాయ‌కుల‌తో తాను మాట్లాడన‌ని కోమ‌టిరెడ్డి అన్నారు. మ‌ర్యాద ఇవ్వాల‌ని కోమ‌టిరెడ్డి ముస్లిం నాయ‌కులకు సూచించారు. దీంతో కోపంతో ఊగిపోయిన స‌ద‌రు నాయ‌కుడు.. అస‌లు మీకు ఎందుకు మర్యాద ఇవ్వాలంటూ ప్ర‌శ్నించారు. అక్క‌డే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ముస్లిం నాయ‌కుడిని ప‌క్క‌కు లాగి, పోలీసు వాహ‌నంలో ఎక్కించుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోమ‌టిరెడ్డి అనుచ‌రుడు ఒక‌రు పోలీసుల‌కు సూచించిన‌ట్లు వీడియోలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Tamannaah: ఇది కదా తమన్నా అంటే.. రిజెక్ట్ చేసిన వాళ్ళతోనే కలిసినటిస్తోందిగా?

  Last Updated: 20 Mar 2024, 04:19 PM IST