Chandrababu : చంద్రబాబు ఇంటికి ఏఐజీ వైద్యుల బృందం

హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబును ఏఐజీ వైద్యుల బృందం కలిసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Chandrababu Liquor Case

Chandrababu Liquor Case

స్కిల్ డెవలప్ కేసులో మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు (Chandrababu)..నేడు హైదరాబాద్ (Hyderabad) కు చేరుకున్నారు. హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబును ఏఐజీ వైద్యుల (AIG Doctors) బృందం కలిసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏఐజీ వైద్య బృందం పరీక్షించింది. రేపు గురువారం ఉదయం 10గంటలకు ఏఐజీ ఆసుపత్రికి రావాలని సూచించింది. ఈమేరకు ఆయనకు అవసరమైన వైద్యపరీక్షలు చేయనున్నారు. 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు మంగళవారం విడుదలయ్యారు. రాజమండ్రి నుండి విజయవాడ వరకు దారి పొడువునా చంద్రబాబు టీడీపీ శ్రేణులతో పాటు జనసేన శ్రేణులు , అభిమానులు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. బుధువారం ఉదయం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి లోనికి ఆహ్వానించారు. అనంతరం కుటుంబ సభ్యులు బాబు తో మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

బుధువారం సాయంత్రం, చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేటలో దిగిన ఆయనకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు.
షరతులతో కూడిన బెయిల్‌ ఇవ్వడం తో.. చంద్రబాబు కారులోంచే తనను చూసేందుకు వచ్చిన వారికి అభివాదం చేశారు. మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు.

Read Also : CM KCR Election Campaign : రైతుల బాధలు కాంగ్రెసోళ్లకు తెలుసా..? – కేసీఆర్ ఫైర్

  Last Updated: 01 Nov 2023, 09:25 PM IST