తెలంగాణ ఎన్నికలు (Telangana Elections 2023) పోలింగ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలను మరింత అలర్ట్ చేసింది అధిష్టానం (AICC). ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హావ నడుస్తుంది. ఏ నియోజకవర్గంకు వెళ్లిన ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ (Congress) కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ధోరణిలో ప్రజలు ఉండడం తో కాంగ్రెస్ అభ్యర్థుల్లో(Congress Candidates) ధీమా రోజు రోజుకు ఎక్కువైపోతోంది. పలు సర్వేలు సైతం కాంగ్రెస్ పార్టీ కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని చెపుతుండడం కూడా కాంగ్రెస్ అభ్యర్థుల్లో బలం పెంచుతున్నట్లు అవుతుంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నేతలు ప్రచారాన్ని తగ్గించడం చేస్తూ వస్తున్నారు. దీంతో అధిష్టానం వారికీ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ప్రజల్లోనే ఉండాలని సూచించింది. గెలుస్తామనే ధీమాతో ఎవరు కూడా ప్రచారాన్ని తక్కువ చేయకూడదని , ఓటు వేసేవరకు కూడా కార్యకర్తలతో ఉండాలని..వారు ఎవర్ని కలుస్తున్నారు..ప్రత్యర్థి పార్టీలు మభ్య పెట్టాలని చేస్తున్నాయా..అనేది ఓ కంటకనిపెట్టాలని సూచించింది. గెలుపు ధీమాతో ఎవరు కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉండకూడదని గట్టిగా హెచ్చరించింది. తెలంగాణ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి కూర్చుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి సోనియా గాంధీ , రాహుల్ , ప్రియాంక , ఖర్గే ఇలా అనేకమంది పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతి స్టెప్ అలోచించి వేస్తున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. అలాగే ఇతర పార్టీల నేతలను రాబట్టుకోవడంలోను సక్సెస్ అయ్యింది. అలాగే సీట్ల విషయంలోనూ విజయం సాధించిందనే చెప్పాలి. కొన్ని చోట్ల పలువుర్ని మార్చాల్సి వచ్చింది కానీ అది తప్పలేదు. ఇవే కాదు బస్సు యాత్ర కు కూడా ప్రజలు నుండి మంచి స్పందన వస్తుంది. ఇక టీవీలలో ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం ఇలా ప్రతిదీ కూడా సక్సెస్ అవుతూ వస్తుండడం తో గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫైనల్ గా ప్రజల నుండి రిజల్ట్ ఇలా వస్తుందనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ గాలి బాగా విస్తున్నదనే చెప్పాలి.
Read Also : Sreeleela: శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ‘రొటీన్’ పాత్రలు, యంగ్ బ్యూటీ ఫ్యాన్స్ డిజాప్పాయింట్