Site icon HashtagU Telugu

Komatireddy Rajagopal Reddy : కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిపై అధిష్టానం సీరియ‌స్‌..వేటు ఖాయం..

Vetu

Vetu

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయ‌డానికి పార్టీ అధిష్టానం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయ‌న‌ను సస్పెండ్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. సస్పెన్షన్ పై ఉమ్మడి నల్గొండ నేతలతో కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సంప్రదింపులు చేస్తున్నార‌ట‌. షోకాజ్ నోటీస్ లేకుండానే సస్పెన్షన్ వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ సాయంత్రం రాజగోపాలరెడ్డి నివాసానికి బీజేపీ నేతలు వెళ్ల‌బోతున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. రాజగోపాలరెడ్డితో బండి సంజయ్, ఈటల, వివేక్‌లు భేటీకానున్నార‌ని, కాంగ్రెస్ కు రాజీనామా, బీజేపీలో చేరికపై రాజగోపాలరెడ్డితో చర్చించనున్నారు.