Bakka Judson : ప్ర‌భుత్వ పెద్దల అక్ర‌మ మైనింగ్‌! జ‌డ్స‌న్ పోరు బాట‌!!

తెలంగాణ వ్యాప్తంగా అక్ర‌మ మైనింగ్ చేస్తోన్న కంపెనీ నిర్వాకంపై కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ పోరుబాట ప‌ట్టారు

  • Written By:
  • Updated On - November 22, 2022 / 05:27 PM IST

తెలంగాణ వ్యాప్తంగా అక్ర‌మ మైనింగ్ చేస్తోన్న కంపెనీ నిర్వాకంపై కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ పోరుబాట ప‌ట్టారు. ప్ర‌త్యేకించి స్వర్గీయ ఇందిర గాంధీ పేద రైతులకు ఇచ్చిన భూముల్లో అక్రమ మైనింగ్ చేయ‌డంపై తిరుగుబాటుకు దిగారు. అక్ర‌మ మైనింగ్ కు నిర‌స‌న‌గా రాస్తా రోకో, రోడ్లపై వంట వార్పు చేయ‌డం ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు క‌ల్వ‌కుంట్ల కుటుంబం అక్ర‌మాల‌పై ప‌లు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ ఇప్పుడు అక్ర‌మ మైనింగ్ పై ఉద్య‌మానికి దిగారు.

బండ రావిరాల, చిన రావిరాల, తారామతిపేట, దేశముఖిలోని సర్వే నెం. 268లో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, రెడీ మిక్స్ , హాట్ మిక్స్ ప్లాంట్ లు ఉన్నాయని ఆయ‌న గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని అబ్దుల్లాపూర్మెట్ , పోచంపల్లి మండలాల ప‌రిధిలోని గ్రామాల్లోని విలువైన సహజ వనరులను రహస్యంగా కొన్ని కంపెనీలు వెలికితీయ‌డాన్ని బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌భుత్వ నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలు అక్ర‌మంగా న‌డ‌వ‌డంపై ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌ల స‌హ‌కారంతో ఇష్టానుసారంగా అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా జ‌రుగుతోన్న ఈ దందాల‌ను ప్రశ్నించే వ్య‌క్తుల‌ను బెదిరించడాన్ని జ‌డ్స‌న్ నిల‌దీశారు. ర‌స్తారోకో, వంటావార్పు కార్య‌క్ర‌మాల్లో జ‌డ్స‌న్ తో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మ్ షాకీర్, కాంగ్రెస్ నాయకులు కొత్త ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి లింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోవు రోజుల్లో అక్ర‌మ మైనింగ్ మీద ఉద్య‌మాన్ని మ‌రింత ప‌దునెక్కించ‌డానికి కాంగ్రెస్ సిద్ధం అవుతుంద‌ని జ‌డ్స‌న్ వెల్ల‌డించారు.