Site icon HashtagU Telugu

AI Data Center: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 3600 మందికి ఉపాధి!

AI Data Center

AI Data Center

AI Data Center: తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ (AI Data Center) క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది.

ఈ ప్రాజెక్ట్‌తో దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుఉందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందన్నారు. సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: AB de Villiers: క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న ఏబీ డివిలియ‌ర్స్‌?

నేడు సీఎం రేవంత్ రెడ్డి బృందం షెడ్యూల్‌

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో తొలి రోజునే భారీ పెట్టుబడులు సమీకరించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ రోజు పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు విప్రో, సన్ పెట్రో కెమికల్స్, జేఎస్​ డబ్ల్యు గ్రూప్, లోంజా గ్రూప్, మిత్రా ఎనర్జీ, టిల్ మన్ గ్లోబల్ హోల్డింగ్స్, బ్లాక్ స్టోన్ కంపెనీలతో ఈ రోజు చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి మరిన్ని కీలకమైన ఎంవోయూలు చేసుకోనుంది. బిల్డింగ్ రీజనరేటివ్ అండ్ సర్క్యులర్ ప్లేసేస్ థీమ్‌తో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు.