హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Ranganath) కు మరో కీలక బాధ్యత అప్పగించింది ప్రభుత్వం. ఇప్పటీకే అక్రమ నిర్మాణాలను కూల్చివేసే బాధ్యత ఉన్న రంగనాథ్ కు ఇప్పుడు హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించబోతుంది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ప్రస్తుతం హైడ్రా ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏలో పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా.. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్‌కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు హైడ్రాతోపాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను కూడా రేవంత్ రెడ్డికే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లోని చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్ నిర్ధారణ, నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రంగనాథ్ విషయానికి వస్తే.. 1970లో నల్గొండలో జన్మించారు. 1996లో డీఎస్పీగా ఎంపికైన రంగనాథ్ కుతొలుత గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా పోస్టింగ్ వచ్చింది. తర్వాత కొత్తగూడెం, నర్సంపేట, మార్కాపురం డీఎస్పీగా పనిచేశారు. 2012లో తూ.గో అడిషనల్ ఎస్పీగా గ్రేహౌండ్స్ ఆపరేషన్లను సమర్థవంతంగా డీల్ చేశారు. దీంతో ఆయనకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది.
2007లో ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా (ఇబ్రహీంపట్నం) హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే తెలంగాణలోని నల్గొండలో అమృత-ప్రణయ్ కేసులో నిందితుడు మారుతిరావు అరెస్టు, విచారణను సమర్థంగా నిర్వహించారు. వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును ఆయనే డీల్ చేసి నిందితుడు సైఫ్ ను త్వరగా అరెస్టు చేశారు. ఇలా ఈయన బ్యాక్ గ్రౌండ్ ఎంతగానో ఉండడం తో రేవంత్ సర్కార్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు అప్పటించింది. ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ.. తన మార్క్ చూపిస్తున్నారు.
Read Also : Spy Camera: వాష్‌రూమ్‌లో స్పై కెమెరా ఉందో..? లేదో..? తెలుసుకోవచ్చు ఇలా..!