Site icon HashtagU Telugu

Lok Sabha Polls : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల దూకుడు

Lokpolls Cma

Lokpolls Cma

తెలంగాణ (Telangana) లో లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు రెండు వారాల సమయం కూడా లేకపోవడం తో అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ ప్రచారం (Campaign))తో హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు బిజెపి , బిఆర్ఎస్ , కాంగ్రెస్ ఎంతో సీరియస్ గా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అధినేతలు , నేతలు , అభ్యర్థులు శ్రమిస్తున్నారు. రెండుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి..మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అందుకు గాను తెలంగాణ లో అత్యధిక స్థానాలు సాధించి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని ఇక్కడి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. లోకల్ నేతలే కాకుండా అగ్ర నేతలు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ బిజెపికి ఓటు వేయాలని కోరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు బిఆర్ఎస్ అధినేత సైతం గత ఆరు రోజులుగా బస్సు యాత్ర చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికలతో తమ సత్తా ఏంటో చూపించాలని గులాబీ బాస్ చూస్తున్నారు. దీనికి గాను కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ యాత్ర కొనసాగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించగా..లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించి తమ సత్తా ను మరోసారి నిరూపించుకోవాలని చూస్తుంది. ఓ పక్క ప్రచారం చేస్తూనే..మరోపక్క ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానిస్తూ తమ బలం పెంచుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ అభ్యర్థులు తమ ప్రచారంలో దూకుడు కనపరుస్తున్నారు. మంత్రులంతా..తమ తమ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటూ మరోసారి కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరుతూ..కాంగ్రెస్ హామీలను వివరిస్తూ వస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ప్రచారాలతో మారుమోగిపోతుంది.

Read Also : KCR : ఆలోచన మార్చుకున్న కేసీఆర్..

Exit mobile version