Modi Go Back: మోడీ గో బ్యాక్.. నో ఎంట్రీ ఇన్ తెలంగాణ!

తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటనపై ఇతర పార్టీల నేతల భగ్గమంటున్న విషయం తెలిసిందే. ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ రాకను

Published By: HashtagU Telugu Desk
Modi

Modi

తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటనపై ఇతర పార్టీల నేతల భగ్గమంటున్న విషయం తెలిసిందే. ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ రాకను వ్యతిరేకిస్తూ కేబీఆర్ పార్క్ దగ్గర తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోదీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులు, పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విమర్శించారు.

మోదీ ప్రాజెక్టులను జాతి అంకితం ఇవ్వడం ఆ తర్వాత వాటిని ఆదాని, అంబానీలకు కట్టబెట్టడం పరిపాటిగా మారింది మండిపడ్డారు. చేనేత పై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రభుత్వమని తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలిశెట్టి అరవింద్ అన్నారు. కాగా మోడీ పర్యటనలో నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ లో వామపక్షాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

  Last Updated: 12 Nov 2022, 04:55 PM IST