Site icon HashtagU Telugu

Ramappa Temple: యునెస్కో ట్యాగ్ తర్వాత తెలంగాణలోని రామప్ప ఆలయంపై కొత్త దృష్టి

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చినప్పటి నుండి మరింత అభివృద్ధి చెందుతోంది.

తాజాగా బెంగుళూలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో రామప్ప ఆలయ విశిష్టతని తెలుపుతూ ఒక వీడియో ప్రజెంటేషన్ చేశారు. ఈ వీడియోలో రామప్ప టెంపుల్ డిజైన్, ఇంజనీర్ల నైపుణ్యంలను కూడా వివరించారు. ప్రజెంటేషన్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రామప్ప ఆలయం కాకతీయుల కళానైపుణ్యాన్ని తెలియచేస్తుంది.
ఇండియాలో దాదాపు నలభై కట్టడాలు హెరిటేజ్ సెక్టార్ లో ఉన్నాయని వీటిని డెవలప్ చేయడంతో పటు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి 24 దేశాలు సహకరించాయని చెప్పవచ్చు. రష్యా ,ఇథియోపియా, ఒమన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, హంగరీ, సౌదీ అరేబియా, సౌత్‌ ఆఫ్రికా తదితర 17 దేశాలు ఓట్లు వేశాయి. 2019లో భారత్‌ నుంచి యునెస్కోకు రామప్ప ఆలయం ఒక్కటే నామినేట్‌ అయింది. కరోనా సిట్యువేషన్ పూర్తిగా తగ్గాకా ఇంటర్నేషనల్ టూరిస్టులు ఎక్కువగా సంఖ్యలో రామప్పకు వచ్చే అవకాశముందని, తద్వారా రానున్న రోజుల్లో రామప్ప ఇమేజ్ పెరగడమే కాకుండా ఆదాయపరంగా కూడా హెల్ప్ అయ్యే అవకాశముందని అధికారులు హోప్స్ పెట్టుకున్నారు

Exit mobile version