Eye Sight: చీకట్లో ఫోన్ చూసి చూసి.. హైదరాబాదీ మహిళ కళ్ళు పోయాయి!

అతి ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు.. చీకట్లో అతిగా స్మార్ట్ ఫోన్ చూసినందుకు

అతి ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు.. చీకట్లో అతిగా స్మార్ట్ ఫోన్ చూసినందుకు హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల మహిళ తన కంటిచూపును పోగొట్టుకుంది (Lost Eye Sight) . ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే స్మార్ట్ ఫోర్ విజన్ సిండ్రోమ్ (SVS) ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ కు చెందిన న్యూరాలజిస్టు డాక్టర్ సుధీర్ ఈవిషయాన్ని వెల్లడించారు.

డాక్టర్ సుధీర్ కథనం ప్రకారం.. ” ఆ మహిళ గతంలో బ్యూటీషియన్ గా పనిచేసేది.వయసులో చిన్నవాడైన తన కొడుకును చూసుకునేందుకు ఆమె ఉద్యోగం మానేసింది. ఇంటి పట్టునే ఉండడంతో స్మార్ట్ ఫోన్ కు బానిసైంది. గంటల కొద్దీ ఫోన్ లో ఏదో ఒకటి చూస్తుండేది. రాత్రి వేళల్లో లైట్లన్నీ ఆపేసి ఫోన్ చూస్తుండేది. అందుకే కంటి చూపు దెబ్బతింది. ఫోన్ చూసే సమయం తగ్గించుకోవాలని సలహా ఇచ్చాను.ఇప్పుడామె కంటిచూపు (Eye Sight) చాలావరకు మెరుగైంది18 నెలల్లో ఆమె కంటిచూ సాధారణ స్థితికి చేరుకుంది” అని ఆయన పేర్కొన్నారు.

ఈ లక్షణాలతో హాస్పిటల్ కు

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. వంకరటింకర గీతలు .. ఉన్నట్టుండి మెరుపులు కనిపిస్తుండడం వంటి లక్షణాలతో ఆమె తన వద్దకు వచ్చిందని వివరించారు. ఒక్కోసారి కళ్లకు ఏమీ కనిపించకపోవడం, దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలతో ఆమె బాధపడేదని తెలిపారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే స్మార్ట్ ఫోర్ విజన్ సిండ్రోమ్ (SVS) తో బాధపడుతున్నట్టు వెల్లడైందని తెలిపారు.

స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటే?

స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్‌ను డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా పిలుస్తారు. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌ల వంటి డిజిటల్ పరికరాలను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల వస్తుంది. దీని వల్ల కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం, దృష్టి మసకబారడం, తలనొప్పి, మెడ. భుజాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Also Read:  Rajasthan CM: నిండు సభలో నవ్వులపాలైన రాజస్థాన్ సీఎం!