హైదరాబాద్: అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలపై మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరావును అరెస్టు చేసిన కొద్ది రోజులకే పోలీస్ శాఖలో బదిలీల పరంపర కొనసాగింది. హైదారబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం 69 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీసు సీనియర్ అధికారులు, సీపీ అధ్యక్షతన పలుమార్లు చర్చలు జరిపారు. మెజారిటీ అధికారులతో పాటు శాంతిభద్రతలు (ఎల్ అండ్ ఓ), ట్రాఫిక్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌ఓ)లందరినీ బదిలీ చేయాలని నిర్ణయించారు. స్పెషల్ బ్రాంచ్‌లు (SB), సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లు, కంట్రోల్ రూమ్‌లలో ఇతర విభాగాలలో ప్రస్తుతం ఉన్న పోస్టులలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసిన పోలీస్ స్టేషన్‌లలో సూపరింటెండెంట్‌లుగా పని చేస్తున్నారు. దీంతో చాలామందిపై బదిలీ వేటు పడింది. ఒకేసారి కమిషనరేట్ పరిధిలో 69 మంది సీఐలను బదిలీ చేశారు.