Delhi Excise Policy Case: కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకుఇప్పుడప్పుడే కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఈ కేసులో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నుంచి సీబీఐ కస్టిడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె దేశ రాజధానిలోని తీహార్ జైలులో ఉన్నారు

Delhi Excise Policy Case; మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడప్పుడే కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఈ కేసులో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నుంచి సీబీఐ కస్టిడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె దేశ రాజధానిలోని తీహార్ జైలులో ఉన్నారు. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కవితను ఇప్పటికే ఏప్రిల్ 6న తీహార్ జైలులో విచారించామని సీబీఐ ఢిల్లీ కోర్టుకు తెలియజేసింది. సమాచారం ఇచ్చిన మరుసటి రోజే అంటే ఇవాళ ఆమెను సీబీఐ అరెస్ట్ చేసి తమ కస్టడీలోకి తీసుకుంది.

అంతకుముందు కవితను జ్యుడీషియల్ కస్టడీలో విచారించాలని కోరుతూ సీబీఐ చేసిన విజ్ఞప్తికి వ్యతిరేకంగా కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా దాఖలు చేసిన దరఖాస్తుపై సీబీఐ స్పందించింది. ఇప్పటికే కవితను విచారించినందున, ఆమె దరఖాస్తుకు సమాధానం ఇవ్వబోమని సీబీఐ కోర్టుకు తెలిపింది. కాగా మద్యం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి కవితను ఈడీ అరెస్టు చేసింది.

We’re now on WhatsAppClick to Join

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసింది . మార్చి 21న అరెస్టు చేయగా ఆయన ప్రస్తుతం ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం వ్యాపారులకు లైసెన్సులను మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని కార్టెలైజేషన్‌కు అనుమతించిందని , అయితే అవి కొంతమంది డీలర్‌లకు అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆప్ పదేపదే ఖండించింది. అయితే ఈ కేసులో ఇప్పటికే భారీ మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తుంది.

Also Read: PM Modi Interview: రామ మందిరం గురించి అమెరికా మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఏం చెప్పారో తెలుసా..?