Telangana Congress: రేవంత్ కు పదవీ గండం?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి బలమా? బలహీనమా?

  • Written By:
  • Updated On - November 21, 2021 / 08:41 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి బలమా? బలహీనమా? అనేదానిపై ఢిల్లీ కేంద్రంగా చర్చ జరుగుతుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలను చూసి ఏఐసీసీ పెద్దలు పునరాలోచనలో పడ్డారని టాక్. నోటా కంటే తక్కువ ఓట్లు రావడంపై సీరియస్ గా చర్చిస్తున్నారని తెలిసింది. కేవలం 1.4శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కు రావటం కాంగ్రెస్ పార్టీ కి కోలుకోలేని దెబ్బ. జరిగిన నష్టానికి తాను బాధ్యత తీసుకుంటానని రేవంత్ చెప్పినప్పటికీ ఢిల్లీ పెద్దలు విశ్వసించడం లేదట. వార్ రూమ్ లో జరిగిన మీటింగ్లో రేవంత్ ఒంటెద్దు పోకడ పై చాలా సీరియస్ చర్చ జరిగిందని తెలిసింది.

Also Read: ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద!

పీసీసీ చీఫ్ గా భాద్యతలు తీసుకున్న తరువాత ఇంద్రవెల్లి, భువనగిరి సభల గురించి ప్రస్తావించారు. ఆ రెండు సభలకు ఆయా ప్రాంతాలకు ఇంచార్జ్ లు గా ఉన్న మాహేశ్వర్రెడ్డి, కోమటిరెడ్డి కి తెలియకుండా సభలను రేవంత్ ప్రకటించాడు. వాళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ లీడర్లు. ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ గా మాహేశ్వర్రెడ్డి ఉన్నాడు. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి కీలక నేత. పీసీసీ కి పోటీ పడిన సీనియర్ పొలిటీషియన్. వీళ్ళతో పాటు చాలా మంది సీనియర్లు రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ, ఏఐసీసీ మాత్రం రేవంత్ రెడ్డి కి మద్దతుగా నిలిచింది. సీనియర్ల నోరు మూయించే దిశగా ఆలోచించింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు తరువాత సీనియర్లు ఇచ్చిన సలహా గురించి ఆలోచనలో పడింది. వన్ మేన్ షో తెలంగాణలో రేవంత్ నడుపుతున్నాడని వార్ రూమ్ ఒక నిర్ణయానికి వచ్చింది.

Also Read: బాధితులకు సహాయం చేయాలని రాహుల్ పిలుపు

పంజాబ్ మాజీ సీఎం అమరేంద్ర సింగ్ ఇటీవల సోనియాకు రాసిన లేఖలో రేవంత్ నియామకం గురించి ప్రస్తావించాడు. కాంగ్రెస్ నష్టపోతున్న తీరుపై ఆయన సుదీర్ఘ లేఖ ఇటీవల సోనియాకు రాసాడు. దానిలో తెలంగాణ కాంగ్రెస్ తీరును ప్రస్తావించాడు. ఈ విషయాన్ని కూడా వార్ రూమ్ చాలా సీరియస్ గా ఆలోచించింది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళను పీసీసీ చీఫ్ లుగా నియమిస్తే కాంగ్రెస్ నిలబడదని అమరేంద్ర సింగ్ తెలిపాడు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నియామకాలు ఎక్కువగా ఇతర పార్టీ ల నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళను కాంగ్రెస్ సీనియర్ల పై రుద్దుతుందని లేఖలో స్పష్టం చేశాడు.
కాంగ్రెస్ భావజాలం ఉన్న మర్రి చెన్నారెడ్డి విషయాన్ని వార్ రూమ్ గుర్తు చేసుకుంది. 1978, 1989 ఎన్నికల గురించి ఆరా తీశారు. రెడ్డి కాంగ్రెస్ కి చెన్నారెడ్డి 1978 లో ఉన్నప్పటికీ 1989 నాటికి కాంగ్రెస్ ఐ కి వచ్చాడని, అందుకే రామారావు లాంటి వాళ్ళను కాదని కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని విశ్లేషణ చేసింది.
పైగా ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బీసీ ఓటు బాంక్ ను కూడగట్టు కుంటున్న విషయాన్ని వార్ రూమ్ పరిశీలించింది. 50శాతం పైగా ఓటు బాంక్ ఉన్న బీసీ లను తమ వైపు తిప్పుకునే ప్లాన్ చేస్తుంది. రెడ్డి ఓటు బాంక్ తెలంగాణలో ఉన్నప్పటికీ , ఆ ఓట్లు వివిధ పార్టీలకు వెళ్లాయని భావిస్తుంది. తొలి నుంచి రెడ్డి సామాజిక వర్గం మీద బీసీలు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే రామారావు పార్టీ పెట్టిన తరువాత ఎటువైపు ఎక్కువగా బీసీ లు ఉండే వాళ్ళు. తెలంగాణ సెంటిమెంట్ పార్టీ గా టీఆర్ఎస్ కు ఇప్పుడు ఆ వోట్ బాంక్ ఉంది. దాని మీద బీజేపీ కన్నే సింది. కానీ, కాంగ్రెస్ మాత్రం పాత పద్దతిలో రెడ్డి వోట్ బ్యాంక్ ను నమ్ముకుంది. అందుకే రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ ను చేశారు. ఈ ఈక్వషన్ తప్పుగా వార్ రూమ్ ఇప్పుడు భావిస్తుంది.

Also Read: కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పది అంశాలు ఇవే

రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చకపోతే కాంగ్రెస్ సీనియర్లు ఆయనతో కలిసి పనిచేసే వాతావరణం లేదని నిర్ణయానికి వచ్చింది.ఒక వేళ ఇలాగే వదిలేస్తే రాబోవు రోజుల్లో రేవంత్ రూపంలో పార్టీ కి గడ్డు పరిస్థితులు ఉంటాయని అంచనా కు వచ్చింది.
ఒక వేళ అధికారంలోకి కాంగ్రెస్ వస్తే రేవంత్ మార్క్ నియామకాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని ఊహిస్తుంది. కొత్త పార్టీ దిశగా ఆయన అడుగులు వేసే ఛాన్స్ ఉందని లోతుగా వార్ రూమ్ విశ్లేచించింది. సో..ఇక రేవంత్ పదవి అప్పుడు ఉడుతుందో లెక్కపెట్టుకో వాల్సిందే.