Debts, payment : అధికారంలోకి వచ్చాక 26వేల కోట్లు అప్పులు చెల్లించాం: డిప్యూటీ సీఎం

అప్పులపై హరీశ్ రావు అనేక ఆరోపణలు చేశారు. హరీశ్ రావుకు ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

Published By: HashtagU Telugu Desk
After coming to power, we paid 26 thousand crores of debt: Deputy CM

After coming to power, we paid 26 thousand crores of debt: Deputy CM

Debts, payment : తెలంగాణ అసెంబ్లీలో అప్పులు వాటి చెల్లింపు పై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ మొత్తం అప్పు రూ. 6 లక్షల 71వేల కోట్లు అని ఆయన వెల్లడించారు. అప్పులు పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7లక్షల 19వేల కోట్లు అని తెలిపారు. అప్పులపై హరీశ్ రావు అనేక ఆరోపణలు చేశారు. హరీశ్ రావుకు ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

మేము అధికారంలోకి వచ్చాక 26వేల కోట్లు అప్పులు చెల్లించామని భట్టి విక్రమార్క తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక రూ.52వేల 118 కోట్లు అప్పులు చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత మార్చి 01న ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. వాటితో రైతు భరోసాకి 7,625 కోట్లు చెల్లించామని అన్నారు. రైతు రుణమాఫీ 20,615 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు 40వేల 150 కోట్లు విలువ చేసే బిల్లులు పెండింగ్ పెట్టారని తెలిపారు. అందులో 12వేల కోట్లు మేము చెల్లించామని భట్టి విక్రమార్క తెలిపారు.

Read Also: Jagtial Sub Jail: జగిత్యాల సబ్‌ జైలులో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

  Last Updated: 19 Dec 2024, 03:19 PM IST