MLA Purchasing Case : బండి సంజయ్ పేరు చెప్పాలంటూ నాపై ఒత్తిడి తెస్తున్నారు..!!

  • Written By:
  • Updated On - November 29, 2022 / 10:05 AM IST

ఎమ్మెల్యేల ఎర కేసు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలంటూ సిట్ తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తుందంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్దమన్న శ్రీనివాస్ …ఆ జీవోను రద్దు చేయాలంటూ కోరారు. సీఆర్ సీపీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో తాను విచారణకు హాజరైనట్లు చెప్పారు. మూడురోజుల పాటు బండి సంజయ్ పేరును చెప్పాలంటూ మానసికంగా ఒత్తిడికి గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సిట్ దర్యాప్తు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉందంటూ మండిపడ్డారు. సిట్ దర్యాప్తును ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పోలీసు అధికారులతోపాటు, ఎమ్మెల్యే పైలేట్ రోహిత్ రెడ్డి, రామచంద్రాభారతి, సింహయాజీ, నందకుమార్ సీవీ ఆనంద్ తోపాటు ఇద్దరు సిట్ సభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. ఈనెల 21,22 తేదీల్లో సిట్ ఎదుట హాజరైన నన్ను బండిసంజయ్ పేరుతోపాటుగా బీజేపీ ముఖ్యనేతల పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారన్నారు.