Controversial Ads: అల్లు అర్జున్ యాడ్ కంటే ముందు ప్రభుత్వ సంస్థలు అభ్యంతరం తెల్పిన సినిమాలివే

రాపిడో సంస్థ యాడ్ లో నటించిన హీరో అల్లుఅర్జున్ ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీశారని భావించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాపిడో సంస్థతో పాటు సినీ నటుడు అల్లుఅర్జున్ కు లీగల్ నోటీసులు పంపారు.

రాపిడో సంస్థ యాడ్ లో నటించిన హీరో అల్లుఅర్జున్ ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీశారని భావించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాపిడో సంస్థతో పాటు సినీ నటుడు అల్లుఅర్జున్ కు లీగల్ నోటీసులు పంపారు. ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని” అల్లు అర్జున్ అనడం ఆ యాడ్‌లో చూడొచ్చు. తెలుగు నేలపై సినిమాలు, యాడ్స్ విషయాల్లో ప్రభుత్వ సంస్థల అభ్యంతరాలు ఇదే తొలిసారి కాదు.

1992లో అంకురం సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ఇవ్వాలని అనుకున్నప్పుడు అప్పటి పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఆ సినిమా పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేదిగా ఉందనీ, అలాంటి చిత్రానికి అవార్డు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ఏ సినిమాకూ ఇవ్వలేదు.

Also Read : విప్ల‌వం నీడ‌న `గోండుల‌` వ్య‌ధ‌

2002లో జయం సినిమాలోని రైలు బండి పాట విషయంలోనూ రైల్వే సంస్థ నుండి అభ్యంతరాలు వచ్చాయి. బండి బండి రైలు బండి, వేళకంటు రాదూలెండి
దీనిగాని నమ్మూకుంటే అంతేనండీ.. అంతేనండీ అనే పాటను రైల్వే శాఖ అభ్యంతరాలతో “బండి బండి రైలు బండి.. ఎంత మంచి రైలు బండీ
ఊరువాడా తిప్పేనండీ అంతా రండి.. అంతా రండి” లాగా పాజిటివ్ గా మార్చారు.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు

ఇక వ్యక్తుల, సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతిని సినిమా టైటిల్స్ మార్చిన లెక్కలు రాస్తే పేజీలు సరిపోవనుకోండి. ప్రమోషన్స్ కోసం కూడా కొందరు యాడ్స్ విషయంలో కావాలని పోరపాట్లు చేస్తారనడం కూడా కాదనలేని సత్యమే.