ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఈ ఫైనల్ లిస్ట్ లో అందరి ఊహాగానాలు తలకిందులు అయ్యాయి. పటాన్ చెరు, సూర్యాపేట , తుంగతుర్తి స్థానాలకు సంబదించి అధిష్టానం షాక్ ఇచ్చింది. పటాన్ చెరు అభ్యర్థి గా (Congress Patancheru Candidate) ముందుగా నీలం మధు (Neelam Madhu) పేరును ప్రకటించినప్పటికీ, అతడికి బీ ఫాం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి.. తాజాగా ఈ స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) పేరును ఖాహారు చేసింది. అలాగే సూర్యాపేట టికెట్ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి ఇచ్చి.. టీపీసీసీ నేత పటేల్ రమేశ్ రెడ్డి ని నిరాశకు గురి చేసింది.
అలాగే తుంగతుర్తి టికెట్ (Thungathurthi Constituency) ఆశించిన అద్దంకి దయాకర్ (Addanki Dayakar ) కు అదిష్టానం షాకిచ్చింది. ఆ స్థానాన్ని ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు కేటాయించారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకి దయాకర్ ఇక్కడ బాగా ఆశలు పెట్టుకున్నా, ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అనుకునేలోపు..టికెట్ రాకపోవడం ఫై స్పదించారు. తనకు టికెట్ రాలేదని అభిమానులు , కార్యకర్తలు నిరాశ పడొద్దని తెలిపారు. కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.
‘తుంగతుర్తి టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా..అన్ని విశ్లేషణలు జరిపిన తర్వాత అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఏకభావిస్తున్న..నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా , ఉద్యమ కారుడిగా ..మందుల సామ్యూల్ విజయం కోసం కృష్టి చేస్తానని , ఆయన నామినేషన్ ర్యాలీ లో పాల్గొంటానని ..నాకు టికెట్ రాలేదని మిత్రులు, అభిమానులు , కార్యకర్తలు ఎవరు కూడా బాధపడకూడదని , నేను హ్యాపీ గా ఉన్నానని , ప్రతి నిర్ణయం వెనుక చాల కారణాలు ఉంటాయి. వాటిని మీరు గమనించాలని ..పార్టీకి సంబదించిన ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ కానీ చేయకూడదని..కాంగ్రెస్ గెలుపుకోసం పని చేయాలనీ” దయాకర్ చెప్పుకొచ్చారు.
Read Also : Congress Final List : చివరి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. పటాన్ చెరు అభ్యర్థి మార్పు