Site icon HashtagU Telugu

Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Ramesh Rathod

Ramesh Rathod :  ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) ఇక లేరు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా మార్గం మధ్యలో ఇచ్చోడ వద్ద తుదిశ్వాస  విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని ఉట్నూర్‌కు తరలించారు. అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో రమేష్ రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతుండగా ఆరోగ్యం విషమించింది.అక్కడి నుంచి రమేష్ రాథోడ్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఇచ్చోడ వద్ద కన్నుమూశారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Nitish – Modi : మోడీ సర్కారుకు నితీశ్ మెలిక.. ఆ ‘హోదా’ కోసం తీర్మానం!

Also Read :Bank Holidays – July : జులై నెలలో బ్యాంకు సెలవుల లిస్టు ఇదిగో