Site icon HashtagU Telugu

IAS Amrapali : ఐఏఎస్ ఆమ్రపాలికి మరిన్ని కీలక బాధ్యతలు.. ఆమె నేపథ్యమిదీ..

Amrapali Ias

Amrapali Ias

IAS Amrapali : యువ ఐఏఎస్ ఆమ్రపాలికి సీఎం రేవంత్ సర్కారు పలు కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌, ఐటీ అండ్ ఎస్టేట్‌‌‌తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఎండీగా వ్యవహరిస్తున్న ఆమ్రపాలికి కొన్ని అదనపు బాధ్యతలను కూడా కేటాయించారు. అవేమిటంటే.. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌‌ పదవులు. ఈ అదనపు బాధ్యతలను కూడా ఇకపై ఆమ్రపాలి  నిర్వర్తించనున్నారు. ఈమేరకు ఆమెకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌ హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6న హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు  తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

కుటుంబం వివరాలు..

ఐఏఎస్ ఆమ్రపాలి(IAS Amrapali) స్వగ్రామం ఒంగోలు నగరం శివారులోని ఎన్‌.అగ్రహారం. ఈ గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్‌.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. ఆమ్రపాలి భర్త సమీర్‌ శర్మ ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్‌ శర్మది జమ్మూ కాశ్మీర్‌. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్‌ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్‌ కుమార్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.

Also Read : 39 Killed : అమెరికా ఎటాక్.. ఇరాక్, సిరియాలలో 39 మంది మృతి

పదవులు..

తెలంగాణలో పోస్టింగ్‌కు ముందు ఆమ్రపాలిని అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ సెంట్రల్ కేబినెట్‌ సెలక్షన్‌ కమిటీ పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమె నిలిచారు. ఈ పోస్టులో మూడేళ్ల పాటు (2023 అక్టోబర్‌ 23 వరకు) విధులు నిర్వర్తించారు. ఆమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఇంకా గతంలోకిి వెళితే.. ఐఏఎస్‌కు ఎంపికైన తరువాత 2011లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

Also Read : 46 Dead : అగ్నివిలయానికి 46 మంది బలి.. కాలి బూడిదైన 1100 ఇళ్లు