Site icon HashtagU Telugu

KTR : కేటీఆర్.. దమ్ముంటే నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా – అద్దంకి దయాకర్

Addanki

Addanki

తెలంగాణ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సవాళ్లు , ప్రతిసవాళ్లు తో అధికార కాంగ్రెస్ , బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నేడు జులై 08 న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ (KTR) సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 18 నెలల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ” చర్చకు వచ్చే ధైర్యం రేవంత్ కు లేదు, కేవలం రచ్చ చేయడం తప్ప ఇంకేమీ రాదు” అని ఎద్దేవా చేశారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి పోతున్నాయని, రైతులకు గౌరవం లేదని ఆరోపిస్తూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇప్పుడైనా సరే ఎక్కడైనా చర్చకు సిద్ధమని, స్థలం, తేదీ మీరు చెబితే నేను వస్తా అంటూ కేటీఆర్ సవాల్ చేసారు. “రేవంత్ ఇంటికైనా రావడానికి సిద్ధమే, చర్చకు మీము చాలు, కేసీఆర్ అవసరం లేదు” అంటూ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.

Bomb Threats : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ లు ఇవ్వడం స్టార్ట్ చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. “కేటీఆర్‌.. నీవు నిజంగా ధైర్యవంతుడవైతే నీ అయ్య కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా” అని సవాల్ విసిరారు. శాసనసభలను తక్కువచేసే ధోరణి బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ డ్రామాలు చేయడం సరికాదని, అసెంబ్లీపై గౌరవం లేకుండా వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం మానేయడం కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆరోపించారు.