Addanki Dayakar : బీజేపీ పై మరోసారి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉండబోతుందని ఆయన వెల్లడించారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని అద్దంకి దయాకర్ రావు మండిపడ్డారు. బీజేపీ 2029 లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం నార్త్, సౌత్ లో రాజకీయ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జమిలి ఎన్నికలతో ప్రయోగాలు రాజకీయ ప్రేరేపిత కుట్రలు చేస్తుందని, దేశంలో రాజకీయ ప్రత్యర్థులను కసిగా శత్రుత్వం పెంచుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు అద్దంకి దయాకర్.
Naga Chaitanya : హైలెస్సో.. తండేల్ నుంచి మరో సాంగ్ రెడీ..!
భారతదేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాలతో బీజేపీ ప్రేమగా ఉంటుందని, బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం రాజకీయ దృక్పథమని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఎదగడం అనేది చాలా ప్రమాదకరమని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడుతో కయ్యం బీజేపీ మనగడకు కష్టం అని బీజేపీకి తెలుసు అని ఆయన అన్నారు. బీజేపీ వ్యవహరించే శైలితో చంద్రబాబుతో, నితీష్ కుమార్‌తో ప్రమాదం రావచ్చని దయాకర్ జోస్యం చెప్పారు.
కానీ పవన్ కళ్యాణ్ ని ముందుకు పెట్టి ఏ విధంగా ఆధిపత్యం చెలాయించాలని బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉందని ఆయన అన్నారు. తన రాజకీయ మిత్రులతో రాజకీయ లబ్ధి పొంది అదే రాజకీయ పార్టీని అంతమొందించాలనేదే బీజేపీ ఎత్తుగడ అని ఆయన దుయ్యబట్టారు. దేశ భద్రత కోసం కాంగ్రెస్ అన్ని విధాలుగా పాటుపడిందని, రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. బీజేపీపై ఇప్పటికే వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, బీజేపీ తీరుతో ప్రజలపై పన్నుల భారం పెరిగిందని ఆయన అన్నారు.
Hindusim : హిందూమతం యొక్క 7 అత్యంత శక్తివంతమైన చిహ్నాలు, వాటి విధులు ఏమిటి?