Site icon HashtagU Telugu

Adani Drone : హైదరాబాద్‌లో ‘అదానీ డిఫెన్స్’ డ్రోన్ రెడీ.. ప్రత్యేకతలివీ..

Adani Drone

Adani Drone

Adani Drone : హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్ పార్క్‌ నుంచి అధునాతన డ్రోన్ విడుదలైంది. దాని పేరే.. దృష్టి 10 స్టార్‌లైనర్!!  దీన్ని భారత నౌకాదళం  చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ బుధవారం ఆవిష్కరించారు.  ఈ డ్రోన్ 36 గంటల పాటు విరామం లేకుండా గగనతలం నుంచి పహారా కాయగలదు. 450 కిలోల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. ఇందులో అధునాతన ఇంటెలిజెన్స్, నిఘా ప్లాట్‌ఫారమ్ ఉన్నాయి. STANAG 4671 సర్టిఫికేషన్‌ కూడా ఉంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ డ్రోన్ గగనతలం నుంచి పహారా కాయగలదు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇప్పటికే అనేక చిన్న ఆయుధాలు, మానవరహిత వైమానిక వాహనాలు, రాడార్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏవియానిక్స్, టాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ వంటివి ఉత్పత్తి చేస్తోంది. అదానీ డిఫెన్స్ భారతదేశపు మొట్టమొదటి మానవరహిత వైమానిక వాహనాల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే స్థాపించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ ఆయుధాల తయారీ కేంద్రం.

We’re now on WhatsApp. Click to Join.

దృష్టి డ్రోన్ ను సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. నౌకాదళ అవసరాలకు అనుగుణంగా ఈ మానవరహిత వైమానిక వాహనాన్ని డిజైన్ చేయించారు. ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య (ఐఎస్ఆర్) కార్యకలాపాలలో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు తాజా ఆవిష్కరణ తోడ్పడనుంది. ఐఎస్ఆర్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశీయంగా డ్రోన్ల తయారీ, నిర్వహణ చేపట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను తయారు చేయడంతో పాటు కౌంటర్ డ్రోన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.

Also Read: Gautam Adani : 2 లక్షల కోట్ల పెట్టుబడి పెడతాం.. 1 లక్ష ఉద్యోగాలిస్తాం : అదానీ

అదానీ గ్రూప్‌ దివాలా ప్రక్రియలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని ల్యాంకో అమర్‌కంటక్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కొనుగోలు కోసం పోటీపడుతోంది. ఇందుకోసం రూ.4,100 కోట్లకు బిడ్‌ సమర్పించింది. ఈ నెల 16న ఎన్‌సీఎల్‌టీ దీనిపై నిర్ణయం తీసుకోనుంది. 2022 జనవరిలోనే ఈ ప్లాంట్‌ కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) నాయకత్వంలోని కన్సార్షియం రూ.3,020 కోట్లకు బిడ్‌ సమర్పించింది. మెజారిటీ రుణదాతలు ఆమోదించడంతో ఈ ప్రతిపాదనను దివాలా పరిష్కార నిపుణుడు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కోసం సమర్పించారు. ఎన్‌సీఎల్‌టీ తన నిర్ణయాన్ని వెల్లడించక ముందే అదానీ గ్రూప్‌ సంస్థ అదానీ పవర్‌ రూ.4,100 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. పీఎ్‌ఫసీ సమర్పించిన బిడ్‌ కంటే ఇది 36 శాతం ఎక్కువ. దీంతో ల్యాంకో అమర్‌కంటక్‌ ప్లాంట్‌ అదానీ గ్రూప్‌ పరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.