Site icon HashtagU Telugu

Mohan Babu : పరారీలో నటుడు మోహన్ బాబు..పోలీసుల గాలింపు..!

Actor Mohan Babu is on the run..Police are hunting..!

Actor Mohan Babu is on the run..Police are hunting..!

Mohan Babu : జర్నలిస్టుల పై దాడి ఘటన లో టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. అభ్యర్థనను కొట్టివేసింది. అయితే ఈ క్రమంలోనే మోహన్ బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా ఆయన ఇంట్లో లేరు. దీంతో మోహన్ బాబు పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు.

పరారీలో ఉన్న మోహన్ బాబు కోసం ఇప్పటికే 5 చోట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఎక్కడా ఆయన ఆచూకి లభించలేదని పోలీసులు తెలిపారు. ఆయన ఆచూకీ దొరకపోవడంతో పోలీసులు మరికొన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో రాజీ కోసం కూడా మోహన్ బాబు కుటుంబం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

కాగా, మూడు రోజుల క్రితం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కుంటుంబ గొడవలు, కేసుల నేపథ్యంలో న్యూస్ కవర్ చేసేందుకు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లిన కొందరు జర్నలిస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిడుతూ, లోగోలు లాక్కుని దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు అయింది.

మరోవైపు దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేసిన విషయం తెలసిందే. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్‌ సోదరుడు గాయపడటం నాకు బాధ కలిగించింది. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయా. ఆ రోజు నా ఇంటిగేటు విగిరిపోయింది.. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని.. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు లేఖలో వివరించారు.

Read Also: kolkata : డాక్టర్‌ హత్యాచారం కేసు..ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపాల్‌కు బెయిల్‌