Telangana Number 1 : ఒక విషయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. శభాష్ అనిపించుకుంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా ? సొంత పన్నుల రాబడి విషయంలో !! ఈ విభాగంలో దేశంలోనే నంబర్ 1 తెలంగాణ అని తాజాగా కేంద్ర సర్కారు పార్లమెంటు వేదికగా విడుదల చేసిన ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. సొంత పన్ను వసూళ్ల విషయంలో దేశంలోని 15 పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రమే బెటర్‌గా ఉందని ఆర్థిక సర్వే నివేదిక తేల్చి చెప్పింది. తెలంగాణలో సొంత పన్ను వసూళ్లు 88 శాతం దాకా ఉన్నాయని పేర్కొంది. పన్ను వసూళ్లలో సొంత పన్నుల రాబడి సగానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలవడం విశేషం.
Also Read :Plane Crash : షాపింగ్ మాల్‌పైకి దూసుకెళ్లిన విమానం.. ఆరుగురు మృతి
ఆర్థిక సర్వే నివేదికలో తెలంగాణ గురించి..
- 2024 సంవత్సరం సెప్టెంబరులో తెలంగాణలోని సీఎం రేవంత్‌రెడ్డి(Telangana Number 1) ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) విధానాన్ని ఆర్థిక సర్వే నివేదిక ప్రశంసించింది. చిన్న ఉత్పత్తిదారులు తమ వస్తువులను విక్రయించుకునేందుకు కేంద్ర సర్కారు ఈ కామర్స్ హబ్‌లను నెలకొల్పాలని యోచిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని ప్రకటించిందని నివేదిక గుర్తుచేసింది.
- ప్రజలకు రక్షిత తాగునీటిని అందించేందుకు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న 8 రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని ఆర్థిక సర్వే నివేదిక చెప్పింది.
- అత్యధిక ఇరిగేటెడ్(వ్యవసాయ సాగు యోగ్యమైన) ఏరియాతో దేశంలోనే నాలుగో స్థానంలో తెలంగాణ నిలిచిందని నివేదిక తెలిపింది. 2016-21 సంవత్సరాల వ్యవధిలో దేశంలో వ్యవసాయ భూములకు సాగునీటి వసతి పెరిగిన రాష్ట్రాల్లో తొలి మూడు స్థానాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.
- మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో తెలంగాణలోని వి-హబ్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని ఎకనమిక్ సర్వే లో పేర్కొన్నారు.
- డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసేందుకు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రాజెక్టు ఆసియాలోనే మొట్టమొదటిదని ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది.
- భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ప్రవేశపెట్టిన ఐ-డ్రోన్ ప్రాజెక్టు కింద డ్రోన్ల ద్వారా తెలంగాణలో టీబీ నమూనాలను రవాణా చేస్తున్నారని నివేదిక తెలిపింది.