Accident in KCR’s Convoy : కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం..

నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ లోని పదికి పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 08:45 PM IST

కేసీఆర్ కాన్వాయ్‌ (KCR’s Convoy)లో పెను ప్రమాదం (Accident) తప్పింది. ప్రస్తుతం కేసీఆర్ పోరుయాత్ర‌ (Poruyatra) మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో రైతుల కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల పాటు బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం తెలంగాణ భవన్ నుండి యాత్ర స్టార్ట్ చేసారు. మొద‌ట‌ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలోని తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేసిన కేసీఆర్.. అనంత‌రం బ‌స్సు యాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ లోని పదికి పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కేసీఆర్ కు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో పాటుగా కారులో ఉన్న డ్రైవర్స్ కు కూడా ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కేసీఆర్ యాత్రలో రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. గత 20 రోజులుగా కల్లాల్లో ఓడ్లుపోసుకొని ఎదురుచూస్తున్నామని కనీసం ధాన్యం కొనేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని.. రైతు బతుకు అంతా ఆగమైందని , బీఆర్‌ఎస్‌ హయాంలో నడి ఎండాకాలంలో నీళ్లు మత్తళ్లు దునికేవని.. రైతు బంధు రాలేదని, మీరు ఉన్నప్పుడే అప్పుడే బాగుండే సార్‌.. మళ్లీ మీ పాలనే రావాలని పలువురు రైతులు చెప్పుకొచ్చారు.

ఇక బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై నిప్పులు చెరిగారు. మళ్లీ రైతులు గుండెలపై చేయి వేసుకొని ధైర్యం గా ఉండాలంటే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించాలని..బిఆర్ఎస్ గెలిస్తే కేంద్రం మెడలు వంచి పని చేయిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మి మోసపోయారు..మరోసారి ఆలా మోసపోవద్దని తెలిపారు.

Read Also : Virupaksha : ‘విరూపాక్ష’ సినిమా బిగ్‌బాస్ నటుడితో చేయాల్సింది.. కానీ సాయి దుర్గ తేజ్..